ఓ వైపు ఎన్నికలు... మరో వైపు బదిలీలు! ఎన్నికల సంఘం ఆలోచన ఏంటి  

Election Commission Transfer Action On Police Officers-

ఏపీ రాజకీయాలలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సంఘం ఈ సారి ప్రత్యేక ద్రుష్టి సారించింది.అధికార పార్టీని కొంత మంది ప్రభుత్వం అధికారులు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సహకారం అందుతుందని వైసీపీ శ్రేణులు ఆరోపణలు చేసి, ఎన్నికల సంఘంకి ఫిర్యాదు చేసారు.

Election Commission Transfer Action On Police Officers-

ఈ నేపధ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఎన్నికల సంఘం ఏపీలో అధికారులపై అన్ని తానై ఇష్టారాజ్యంగా బదిలీ వేటు వేసింది.ముఖ్యంగా వైసీపీ ఎవరి పేర్లు సూచిస్తూ పోతే వారిని బదిలీ చేయడం మొదలెట్టింది.


ఇందులో ముందుగా శ్రీకాకుళం, కడప ఎస్పీలతో పాటు, ఇంటలిజెన్స్ ఆఫీసర్ మీద బదిలీ వేటు వేసింది.తరువాత చీఫ్ సెక్రెటరీని కూడా బదిలీ చేసింది.ఇక తాజాగా ప్రకాశం జిల్లా ఎస్పీని కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మంగళగిరి, తాడేపల్లి, మదనపల్లి సీఐలను కూడా ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

అధికార పార్టీకి అండగా ఉంటున్నారన్నదే బదిలీకి కారణమైన ఆరోపణలుగా తెలుస్తోంది.అయితే ఎన్నికల సంఘం ఏకపక్షంగా వైసీపీ నేతలు ఆరోపించిన అందరిని బదిలీ చేస్తూ ఉండటం రాజకీయంగా సంచలనంగా మారింది.

.

తాజా వార్తలు

Election Commission Transfer Action On Police Officers- Related....