జయప్రదపై ఆజంఖాన్ వాఖ్యలు! ఎన్నికల సంఘం సీరియస్  

జయప్రదపై ఆజంఖాన్ చేసిన వాఖ్యలని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం. .

Election Commission Serious On Ajam Khan Comments On Jayaprada-bjp,election Commission Serious,jayaprada,modi

  • ఉత్తరప్రదేశ్ రాంపూర నియోజకవర్గంలో మన తెలుగు నటి జయప్రద బీజేపీ పార్టీ తరుపున తరుపున పోటీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. సమాజ్ వాది పార్టీ నుంచి ఆమె బయటకి వచ్చి అమిత్ షా నేతృత్వంలో బీజేపీ పార్టీ లో పని చేయడానికి రెడీ అయ్యింది.

  • జయప్రదపై ఆజంఖాన్ వాఖ్యలు! ఎన్నికల సంఘం సీరియస్-Election Commission Serious On Ajam Khan Comments On Jayaprada

  • దీంతో బీజేపీ పార్టీ జయప్రదకి రాంపూర లోక్ సభ సీటు కేటాయించింది. ఇదిలా ఉంటే రాజకీయాలో మిత్రులే శత్రువులు అవుతారు అన్నట్లు ఒకప్పుడు సమాజ్ వాది పార్టీలో తనతో సన్నిహితంగా ఉండే ఆజంఖాన్ ఇప్పుడు జయప్రదకి అక్కడి ప్రత్యర్ధిగా మారాడు.

  • ఇదిలా ఉంటే ఆజం ఖాన్ జయప్రదని టార్గెట్ గా చేసుకొని మాటల దాడి తీవ్ర తరం చేస్తూ కాస్తా అసభ్యకరమైన వాఖ్యలు కూడా ఉపయోగించాడు. ఇప్పుడు అవి కాస్తా పెను దుమారం రేపాయి.

  • దీంతో ఎన్నికల సంఘం సైతం ఆజం ఖాన్ వ్యాఖ్యలని సీరియస్ గా తీసుకుంది. రేపు ఉదయం ఆరు గంటల నుంచి 72 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అజమ్ ఖాన్ పై ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా అజంఖాన్ కోడ్ ఉల్లంఘించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది.

  • మరో వైపు ఈ వ్యవహారంలో మహిళా కమిషన్ ఆజం ఖాన్ కి నోటీసులు కూడా పంపించింది.