ఏపీలో 3 కోట్ల 69 లక్షల మంది ఓటర్స్! నిర్ధారించిన ఎన్నికల సంఘం!

త్వరలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం వున్న నేపధ్యంలో ఎన్నికల సంఘం తన కార్యక్రమాలు ముమ్మరం చేసింది.ఓ వైపు ఈవీఎం ల మీద అవగాహన కల్పిస్తూ, మరో వైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలెట్టింది.

 Election Commission Releases Final Voters List For Ap-TeluguStop.com

ఇక తాజాగా ఏపీలో వున్న ఓటర్ల సంఖ్యని ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది.ఇక ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏపీలో సుమారు 3 కోట్ల 69 లక్షల 33 వేల 91 మంది ఓటర్లు వున్నట్లు తెలుస్తుంది.

ఇక ఇందులో పురుషుల ఓటర్లు 1,83,24,588 మంది వుండగా, మహిళలు 1,86,04,742 మంది వున్నారని తెలుస్తుంది, ఇక థర్డ్ జెండర్ ఓటర్స్ 3,761 మంది వున్నారని ఎన్నికల సంఘం లెక్కల్లో పేర్కొంది.ఇక రాష్ట్రంలో అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఓటర్లు వుండగా, అత్యల్పంగా నర్సాపురం నియోజకవర్గంలో వున్నారని ఎన్నికల సంఘం నిర్ధారించింది.

అలాగే ఓట్ల తొలగింపు అనేది కేవలం పుకారు మాత్రమె అని, అందులో వాస్తవం లేదని ఎన్నికల సంఘం తేల్చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube