ఏపీలో పరిస్థితులు అదుపు తప్పాయా ? రంగంలోకి కేంద్ర ఎన్నికల సంఘం ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి వాడివేడిగా ఉంది.అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష పార్టీపై అధికార పార్టీ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

 Election Commission Of India Focus On Ap Local Body Elections-TeluguStop.com

ఈ సందర్భంగా అనేక హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దాడులు, గొడవలు జరగడం, దీనిపై తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయడం ఇవన్నీ చోటుచేసుకుంటున్నాయి.

కానీ ఈ విషయంలో ఏపీ ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై హైకోర్టు చివాట్లు పెట్టింది.ఎన్నికల ప్రక్రియ అంతా గందరగోళంగా జరుగుతున్నా, అనేక అక్రమాలకు పార్టీలు, అభ్యర్థులు పాల్పడుతున్నా దీనిపై ఫిర్యాదులు వస్తున్న పట్టించుకునే వారు లేకపవడంతో ఎన్నికల సంఘం ఏం చేస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు.

ఈ విషయంపై హైకోర్టులో కొంతమంది పిటిషన్ దాఖలు చేయడంతో విచారణలో న్యాయమూర్తులు ఎస్ఈ సి పనితీరు పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎస్ఈసీ సక్రమంగా పనిచేయడం లేదని, కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందించారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏపీ పరిస్థితులపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.ఎన్నికల తంతు మొత్తం స్వల్ప వ్యవధిలో ముగించడంతో పాటు, అనేక చోట్ల దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నట్లుగా అనేక వీడియోలు బయటకు వస్తున్నాయి.

కొంతమంది వ్యక్తులపైన భౌతిక దాడులు కూడా జరిగాయి.అయినా ఈ విషయంలో పోలీసులు గాని, ఏపీ ఎన్నికల సంఘం కానీ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో ఇక పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది.

ఎన్నికల్లో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.అంతేకాకుండా తయారు చేయించి ఎక్కడైనా అక్రమాలు జరిగితే ఫిర్యాదు చేయాలని సూచించింది.

కానీ ఏపీలో ఎన్ని అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతున్నా ఏపీ ఎన్నికల సంఘం కానీ, పోలీసులు కానీ, సరైన విధంగా స్పందించడం లేదంటూ పిటిషనర్లు తగిన ఆధారాలు సమర్పించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.గతంలో ఎన్నికల కోడ్ అమలులో లేకపోవడంతో తాము ఏమీ చేయలేకపోయామని ఎన్నికల సంఘం చెప్పిందని, ఇప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటూ హైకోర్టు ప్రశ్నించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube