అది నిజమేనా ..? డీజీపీకి ఈసీ లేఖ   Election Commission Letter Writen To Dgp Issue Of The Call Typing     2018-10-27   08:06:44  IST  Sai M

ప్రతిపక్షనేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని మహా కూటమి నేతల ఫిర్యాదు చేశారు. దీంతో పాటు సీఎం, మంత్రుల క్యాంపు కార్యాలయాల్లో పార్టీ సభలు, రైళ్లలో సీఎం ఫోటోలకు సంబంధించి కొన్ని ఆధారాలను కూటమి నేతలు ఈసీకి సమర్పించారు. ఈ విషయాలపై ఈసీ సీరియస్ గా స్పందించింది.

ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఇతర అంశాలపై వివరణ కోరుతూ ఎన్నికల కమిషన్ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ రాసింది. ఫోన్ ట్యాపింగ్ కు విధివిధానాలు ఏంటి? ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు.. దీనిపై వివరణ ఇవ్వండి అంటూ లేఖలో పేర్కొన్నారు.