కరోనా ఎఫెక్ట్: చేతులకు గ్లవ్స్.. టూత్ పిక్ తో ఎన్నికల్లో ఓటు!

ఎన్నికలు వచ్చింది అంటే ఎంత గోల గోలగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎన్నికల సమయంలో కొందరు రోడ్లపై గోల గోల చేస్తుంటే మరికొందరు టెన్షన్ టెన్షన్ తో ఊగిపోతుంటారు.

 Election Commission Guidelines To Conduct Elections,election Commission, Guideli-TeluguStop.com

అలాంటిది ఎన్నికలు కాస్తా కరోనా సమయంలో వస్తే ఏం చెయ్యాలి ? గతంలో ఉన్నంత ఫ్రీడమ్ ప్రస్తుతం లేదు కదా అని అందరూ ఆలోచిస్తుంటారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ సమయంలో ఎన్నికలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను, సూచనలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

కేంద్రం విధించిన కోవిడ్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.ఓటు వేసిన సమయంలో ఎన్నికల్లో సామజిక దూరం పాటించాలని, చేతికి గ్లవ్స్ ఉండాలని, ఓటు వేయకముందే స్లిప్ ఇవ్వాలని, ఓటు వేసే సమయంలోను వేలు కాకుండా టూత్ పిక్ ఉపయోగించాలని చెప్పారు.

అంతేకాదు 65 ఏళ్ల పైబడి ఉన్న వారు, హోం క్వారంటైన్ లో ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల్లో థర్మల్‌ స్కానర్లు ఉండాలని, ఇన్.అవుట్ ద్వారాల్లో శానిటైజర్లు, సబ్బులు, నీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా గుర్తులు ఏర్పాటు చెయ్యాలని చెప్పారు.

బీఎల్‌వోలు, వాలంటీర్లు భౌతికదూరం నిబంధనలు పాటించాలని సూచించారు.

కాగా కేంద్ర హోం శాఖ విధించిన నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు, పార్టీలు పబ్లిక్ మీటింగ్ లు, రోడ్ షోలు నిర్వహించుకోవచ్చు అని తెలిపారు.

మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు.థర్మల్ స్కానర్లు, పీపీఈ కిట్లు కూడా ఉండాల్సిందే అని తెలిపారు.

ప్రచారం చేసే సమయంలో అభ్యర్థితో పాటు కేవలం ఐదుగురు మాత్రమే ఉండేలా చూసుకోవాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube