మమతా బెనర్జీ కి నోటీసులు జారీ చేసిన ఈసీ..!!

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.ఈనెల ఏడవ తారీఖున హుగ్లీ జిల్లాలో పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై అదేవిధంగా కేంద్ర పారామిలటరీ బలగాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

 Election Commission Issued Notice To Mamata Banerjee Amith Shah, Ec, Bengal Elec-TeluguStop.com

అమిత్ షా ఆదేశాలతో కేంద్ర పారా మిలటరీ బలగాలు.బెంగాల్ గ్రామ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

కొన్నిచోట్ల ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని.మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా బిజెపికి ఓట్లు వేయాలని ఒత్తిడి చేస్తున్నారంటూ మమతా బెనర్జీ పారా మిలటరీ బలగాల పై అనేక ఆరోపణలు చేశారు.దీంతో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం రియాక్ట్ అయ్యింది.

అబద్ధపు ప్రచారాలు చేస్తూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని ఈసీ పేర్కొంది.కేంద్ర బలగాలను విమర్శించటం మంచిది కాదని వారి మనోస్థైర్యం దెబ్బ తీసినట్లే అని వ్యాఖ్యానించడం జరిగింది.

ఈ క్రమంలో మమత కేంద్ర పారా మిలటరీ బలగాల పై చేసిన కామెంట్లకు ఈ నెల పదవ తారీకు వివరణ ఇవ్వాలని మమతా బెనర్జీకి ఈసీ నోటీసులు జారీ చేయడం జరిగింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube