ఎలక్షన్‌ కమీషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ విజయ్‌ దేవరకొండ ఓటు వేయలేదా ఏంటీ?

ఈసారి ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఎలక్షన్‌ కమీషన్‌ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన విషయం తెల్సిందే.అందుకోసం విజయ్‌ దేవరకొండ కూడా తనవంతు అన్నట్లుగా ఈసీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాడు.

 Election Commission Brand Ambassador Vijay Where He Voted-TeluguStop.com

ఎన్నిక కమీషన్‌ ఓటర్లను చైతన్య పర్చే కార్యక్రమాల్లో పాల్గొన్న విజయ్‌ దేవరకొండ ఇంతకు ఓటు వేయలేదా అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.విజయ్‌ దేవరకొండ ఎక్కడ ఓటు వేసినట్లుగా కాని, క్యూలో ఉన్నట్లుగా కాని ఫొటోలు రాలేదు.

ఎంతో మంది సెలబ్రెటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.వారికి సంబంధించిన ఫొటోలు వచ్చాయి.కాని విజయ్‌ దేవరకొండ ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా మాత్రం ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు.విజయ్‌ దేవరకొండ రాష్ట్రంలోని ఏ పోలింగ్‌ బూత్‌కు వెళ్లినా కూడా ఆయన అభిమానులు ఉంటారు.

ఆ సమయంలో ఖచ్చితంగా ఫొటో తీస్తారు.

కాని ఒక్క ఫొటో కూడా ఆయన కనిపించడం లేదు.దాంతో విజయ్‌ ఓటు హక్కును వినియోగించుకోలేదేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.నారాయణ గూడలో అప్పట్లో తాను ఓటును వేశాను అంటూ ఒకసారి చెప్పిన విజయ్‌ దేవరకొండ ఈసారి మాత్రం అక్కడ ఓటు వేసిన దాఖలాలు లేవు.

దాంతో విజయ్‌ దేవరకొండ ఓటు గురించి చర్చ జరుగుతుంది.

విజయ్‌ దేవరకొండ ఓటు వేశాడా లేదా అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు కొందరు మాత్రం ఖచ్చితంగా విజయ్‌ ఓటు వేసి ఉంటాడు అంటూ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ఈసీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించిన విజయ్‌ దేవరకొండ ఓటు వేయకుండా ఎలా ఉంటాడని కొందరు ప్రశ్నిస్తున్నారు.ఈ విషయమై విజయ్‌ దేవరకొండ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube