వెల్లూరులో ఎన్నికలు రద్దు! అంతా డబ్బు మాయ  

తమిళనాడులో భారీగా దొరికిన డబ్బు. వెల్లూరు ఎన్నికలు రద్దు చేసిన ఎలక్షన్ కమిషన్. .

Election Canceled In Vellore Lok Sabha Seat-bjp,dmk,ec,election Canceled,vellore Lok Sabha

ఎన్నికల సంఘం చరిత్రలో లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తూ ఒక నియోజక వర్గం ఎలక్షన్ ని పూర్తిగా రద్దు చేయడం ఇప్పటి వరకు జరగలేదు. అయితే ఈ సార్వత్రిక ఎన్నికలలో అన్ని పార్టీలు ప్రజలని ప్రలోభాలకి గురి చేసి లబ్ది పొందాలని ఎంతగా ప్రయత్నం చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కో నియోజకవర్గం మీద పది నుంచి 50 కోట్లు వరకు ఖర్చు పెట్టిన సందర్భాలు మొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జరిగింది అనేది రాజకీయంగా వినిపిస్తున్న మాట. ..

వెల్లూరులో ఎన్నికలు రద్దు! అంతా డబ్బు మాయ-Election Canceled In Vellore Lok Sabha Seat

ఇప్పుడు అలా అనధికారికంగా డబ్బులు భారీ స్థాయిలో పట్టుబడటంతో తమిళనాడులో వెల్లూరు నియోజకవర్గం ఎన్నికలని ఎన్నికల సంఘం మొదటి సారి రద్దు చేసింది.

తమిళనాడులో విచ్చలవిడి ధనప్రవాహం ఉంటుంది అనే విషయం అందరికి తెలుసు. తాజాగా వెల్లూరులో ఇటీవల అధికారులు డీఎంకె నాయకుల ఇళ్లలో 12కోట్ల భారీ నగదు పట్టుబడింది. నగదు ప్రవాహం భారీస్థాయిలో ఉందని ఈ నియోజకవర్గంలో లోక్ సభ ఎన్నికను రద్దు చేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. తమ నిర్ణయాన్ని రాష్ట్రపతి భవన్ కు నివేదించింది.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. వెల్లూరులో లోక్ సభ ఎన్నికలను రద్దు అయ్యింది.