స్పీడ్ అందుకున్న ఎన్నికల ప్రచార వేడి !  

Election Campaigning In Telugu States Had Increased Speed-bjp,campaigning Schedules,congress,election Campaigning,hyderabad,kcr,political Updates,telangana,telugu States

ఎన్నికల ప్రచారంతో ఏపీ మొత్తం మారుమోగుతోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో జాతీయ నాయకులు ఎన్నికల ప్రచారానికి దిగిపోతున్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ తమ బలం నిరూపించుకుని ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి..

స్పీడ్ అందుకున్న ఎన్నికల ప్రచార వేడి ! -Election Campaigning In Telugu States Had Increased Speed

రాబోయేనాలుగైదు రోజులలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీల అగ్ర నాయకులు పర్యటించేందుకు షెడ్యూల్ రూపొందించుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అనేక సభల్లో తమ వాక్చాతుర్యం ప్రదర్శించేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ లో జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటున్నారు.

ఆ తర్వాత మరో మూడు, నాలుగు రోజుల్లో ప్రధాన మంత్రి మరోసారి తెలంగాణలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని బీజేపీ నాయకులు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకటో తేదీన హైదరాబాద్ కి విచ్చేస్తున్నారు. జహీరాబాద్, వనపర్తి, హుజూర్ నగర్ లలో జరిగే సభల్లో ఆయన పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నారు.

తెలంగాణ ఏపీలో జరిగే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొందనేందుకు రంగం సిద్ధం అయ్యింది. అక్కడ సభ అనంతరం ప్రధాని నేరుగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు లో జరిగే ఎన్నికల సభలో పాల్గొంటారట. దీంతో పాటు రాజమహేంద్రవరం లో ఎన్నికల సభలో కూడా ప్రధాని పాల్గొంటారని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను విస్తృతంగా పర్యటిస్తున్నారు.

అలాగే ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో రోజుకు మూడు నియోజకవర్గాల్లో చొప్పున ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.