కోడిపందాల కంటే దారుణంగా.. పశ్చిమలో బెట్టింగుల జోరు..  

Election Betting In Full Swing In West Godavari-election Betting,west Godavari,పశ్చిమ గోదావరి,బెట్టింగుల జోరు

ఏపీలో ఎన్నికల హడావిడి ముగిసింది. గెలుపు మాదంటే మాదంటూ ఎంతో ధీమాతో ఉన్నారు ఆయా పార్టీల నేతలు, అధినేతలు. అయితే ఈ మధ్యలోనే బెట్టింగ్ రాయుళ్ళ హడావిడి మొదలయ్యింది..

కోడిపందాల కంటే దారుణంగా.. పశ్చిమలో బెట్టింగుల జోరు..-Election Betting In Full Swing In West Godavari

ఎన్నికల ప్రక్రియ ముగియడంతో బెట్టింగ్ బాబు లు రంగంలోకి దిగారు. తెలిసిన వాళ్లందరికీ టచ్ లోకి వెళ్తూ ఫలానా పార్టీ పై పందెం ఉందంటూ ముగ్గులోకి దించుతున్నారు. ఎన్నికల రిజల్స్ వచ్చే వరకూ కూడా ఏపీలో బెట్టింగులు జోరుగా జరిగే జిల్లాలలో తిష్ట వేసుకుని కూర్చోనున్నారట.

ఇప్పటికే ప్రధాన ప్రాంతాలలో ఇల్లు అద్దెకి తీసుకునో మరో రకంగానో బెట్టింగులు మొదలు పెట్టేసారని తెలుస్తోంది.అయితే బెట్టింగులు పేరు చెప్తే గుర్తుకొచ్చే జిల్లాగా పేరొందిన పశ్చిమలో ఇప్పటికే జోరుగా పందాలు జరుగుతున్నాయట. దాంతో కోడి పందాల బెట్టింగుల కంటే కూడా ఇప్పుడు రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై భారీ స్థాయిలో బెట్టింగులు ఉన్నాయట.

రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టే పార్టీ మొదలు నియోజకవర్గాల వారీగా పార్టీల అభ్యర్ధుల గెలుపు ఓటములపై , మెజారిటీలపై , జిల్లాలలో ఎన్ని సీట్లు వస్తాయి అనే కోణంలో బెట్టింగులు కాస్తున్నారట. వీటిని నిర్వహించడానికి బుకీలు రంగంలోకి దిగారు.

ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కోసు పందాలు ఎక్కువగా జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రూ.

25 వేల నుంచి రూ.25 లక్షలు వరకూ కూడా ఆపైనే పందాలు సాగుతున్నాయని అంటున్నారు. పశ్చిమలో మొత్తం 15 స్థానాలు ఉన్నాయి. వాటిలో ఏ పార్టీ ఎన్ని స్థానాలలో గెలుపొందుతుంది. ఎక్కడెక్కడ విజయాలు నమోదు చేస్తుంది అన్న అంశాలపై బెట్టింగులు మొదలయ్యాయట. తెలంగాణలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా జిల్లాలో సుమారుగా రూ..

200కోట్ల వరకు బెట్టింగ్‌లు జరిగాయట.

కానీ ఏపీలో మాత్రం ఇప్పటికే కోటి రూపాయల పందాల ఒప్పందాలు జరిగిపోయాయట. రోజులు గడిచే కొద్ది మరిన్ని పందాలు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. గతంలో టీడీపీకి 15 కి గాను 15 స్థానాలు అప్పగించిన పశ్చిమలో ఈసారి చంద్రబాబు కి పట్టుమని 5 కూడా రావని భారీగా పందాలు కాస్తున్నారట. అంతేకాదు జనసేన ఎంట్రీ తో టీడీపీ ఓడిన చోట మూడో స్థానంలో నిలుస్తుందనే కోణంలో కూడా బెట్టింగులు కాస్తున్నారట. ఇదంతా ఒకెత్తయితే ఏపీలో జరిగిన ఎన్నికలకి ఏపీలో కంటే కూడా తెలంగాణలో బెట్టింగులు తారా స్థాయిలో జరుగుతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.