దొంగలకి రివర్స్ కౌంటర్ ఇచ్చిన వృద్ధ దంపతులు! తమిళనాడులో సంచలనం  

ఈ మధ్య కాలంలో దోపిడీ దొంగలు అలజడి ప్రతి చోట పెరిగిపోయింది. దొంగతనాల కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. కిరాతకంగా హత్యలు చేస్తూ దోపిడీలకి పాల్పడుతున్నారు..

దొంగలకి రివర్స్ కౌంటర్ ఇచ్చిన వృద్ధ దంపతులు! తమిళనాడులో సంచలనం-Elderly Couple Fight Back Armed Robbers With Slippers And Chairs

దొంగతనం ఎలా చేసిన చట్టాన్ని తప్పించుకొని మాత్రం వీరు వెళ్ళలేకపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తమిళనాడులో ఇద్దరు దొంగలు ఇలాగే ఓ ఇంట్లో చొరబడి దొంతనం చేయడానికి ప్రయత్నం చేసారు. వారికి అక్కడ ఊహించని అనుభవం ఎదురైంది.

దీంతో అక్కడి నుంచి వారు పలాయనం చిత్తగించారు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా కడయం పోలీస్టేషన్ పరిధిలో ఓ ఇంటి బయట కూర్చున్న వృద్ధుడిపై వెనకగా వచ్చిన ఓ దుండగుడు ఉరి బిగించే ప్రయత్నం చేసాడు. అతను వెంటనే గట్టిగా కేకలు వేయడంతో భార్య లోపలి నుంచి వచ్చింది.

ఇంతలో మరో ఆగంతకుడు కూడా అక్కడికి వచ్చాడు. దుండగుల కత్తులతో ఆ వృద్ధ దంపతులపై దాడి చేసే ప్రయత్నం చేసారు. అయితే వృద్ధుడు భార్య ఏమాత్రం భయపడకుండా చేతికందిన వస్తువులతో వారిపై దాడి చేసింది.

ఇంతలో వృద్ధుడు కూడా తేరుకొని దాడి చేయడం మొదలెట్టాడు. దీంతో కంగుతిన్న దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

ఈ క్రమంలో ఎంతో ధైర్యంగా ఆగంతకులను ఎదుర్కొన్న వృద్ధ దంపతులను ప్రశంసిస్తున్నారు. వృద్ధ దంపతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వారిని పట్టుకోవడానికి పోలీసులు వల వేసారు.