సంతోష్ శోభన్ ఏక్ మినీ కథ కూడా ఒటీటీ బాట పడుతుంది

గోల్కొండ హైస్కూల్ సినిమాతో నటుడుగా తెరంగేట్రం చేసిన డైరెక్టర్ కొడుకు సంతోష్ శోభన్.ప్రభాస్ కి వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ శోభన్ కొడుకే సంతోష్ అనే విషయం అందరికి తెలిసిందే.

 Ek Mini Katha To Release On Ott Directly-TeluguStop.com

మొదటి సినిమా తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి సంతోష్ హీరోగా తెరంగేట్రం చేసి తనునేను అనే సినిమా చేశాడు.ఈ సినిమాలో అవికాగోర్ అతనికి జోడీగా నటించింది.

అయితే మొదటి సినిమా సంతోష్ కి హిట్ ఇవ్వలేదు.తరువాత సంపత్ నంది నిర్మాణంతో అతను అందించిన కథతో పేపర్ బాయ్ అనే లవ్ స్టొరీ చేశాడు.

 Ek Mini Katha To Release On Ott Directly-సంతోష్ శోభన్ ఏక్ మినీ కథ కూడా ఒటీటీ బాట పడుతుంది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది ఒకే అనిపించుకున్న పెద్దగా సక్సెస్ అయితే కాలేదు.

ఈ సినిమా తర్వాత మూడేళ్ళు గ్యాప్ తీసుకొని ప్రభాస్ హోం బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ వారి కొత్త నిర్మాణ సంస్థ యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా తెరకెక్కించిన ఏక్ మినీ కథ అనే సినిమాలో నటించాడు.

మేర్లపాక గాంధీ అందించిన ఈ కథతో కార్తిక్ రాపోలు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది.అయితే సినిమా రిలీజ్ అయ్యే సమయానికి కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ కావడంతో వాయిదా పడిపోయింది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీని డైరెక్ట్ గా ఒటీటీలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు బోగట్టా.

థియేటర్స్ ఇప్పట్లో తెరిచేల కనిపించడం లేదు.ఒక వేళ ఓపెన్ చేసిన మునుపటిలా ప్రేక్షకులు వచ్చే అవకాశం కూడా తక్కువే ఈ నేపధ్యంలో ఒటీటీ రిలీజ్ బెటర్ అని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

త్వరలో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

#UV Concepts #Ek Katha #Santosh Shoban #Kavya Thaper

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు