చోద్యం : ఒక కాకి కారణంగా 18 రైళ్లు నిలిచిపోయాయి... అసలేం జరిగిందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు  

Eighteen Trains Stopped Due To Crow-crow Bird,eighteen Trains Stopped,high Tension Railway Line,mumbai Railway,కాకి

కొన్ని సార్లు చిన్న సంఘటనలు పెద్ద ప్రభావంను చూపుతాయని చెప్పడంలో అతి శయోక్తి లేదు. చిన్న దెబ్బ తలిగినా ఏం కాదులే అనుకుంటే తెల్ల వారేప్పటికి ఆ గాయం కదలలేకుండా చేయడం మనం చూస్తూ ఉంటాం. అలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి..

చోద్యం : ఒక కాకి కారణంగా 18 రైళ్లు నిలిచిపోయాయి... అసలేం జరిగిందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు-Eighteen Trains Stopped Due To Crow

చిన్నదే అయినా కూడా ఇంత పని చేసిందా అనిపిస్తుంది. తాజాగా ఒక కాకి చేసిన పనికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 రైళ్లు నిలిచి పోయాయి. ఇలాంటి సంఘటనలు మరెక్కడో జరిగితే ఏమో అనుకునే వాళ్లం. కాని ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థ ఉన్న ఇండియాలో ఈ సంఘటన జరిగింది.

లక్షలాది మంది ప్రయాణికులు, వేలాది మంది ఉద్యోగులు పని చేసే రైళ్లు నిలిచిపోవడంకు కారణం ఒక కాకి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ముంబయిలో శనివారం ఉదయం నుండి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు, పలు రైళ్లు రూటు మార్చుతున్నట్లుగా రైల్వే అధికారులు హడావుడిగా ప్రకటన విడుదల చేయడం జరుగుతుంది. కొన్ని రైళ్లు పూర్తిగా రద్దు చేస్తున్నాం. కొంత సమయం వరకు వేచి చూడాలి అంటూ అధికారులు రైల్వే ప్రయాణికులకు తెలియజేయడం జరిగింది.

బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కొన్ని గంటల పాటు రైల్వే అధికారులు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఎక్కడైనా రైలు ప్రమాదం జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి.

చివరకు తెలిసింది ఏంటీ అంటే రైల్వే హైటెన్షన్‌ కేబుల్స్‌ పై ఒక కాకి చనిపోయింది.

కాని చనిపోయిన సమయంలో హైటెన్షన్‌ వైర్లతో షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యింది. ఇన్సులేటర్‌ ద్వారా అటాచ్‌ అయిన వైర్ల కారణంగా వైర్లు కాలి బూడిద అయ్యాయి.

దాంతో వాటిని పునరుద్దీంచేందుకు రైల్వే అధికారులకు చాలా సమయం పట్టింది. ఆ సమయంలో అటుగా వెళ్లాల్సిన రైల్లు చాలా వరకు రద్దు అయ్యాయి. కొన్ని రూటు మార్చారు.

మొత్తానికి ఒక కాకి వల్ల శనివారం లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వందలాది మంది రైల్వే ఉద్యోగులు నానా హైరానా పడ్డారు. అందుకే దేని అంత తేలికగా తీసివేయకూడదు అంటారు.