కోడి గుడ్లను కాదండోయ్.. పాము గుడ్లను పొదింగించారట.. ఎక్కడో తెలుసా?

కోడి గుడ్లను కృత్రిమంగా పొదిగించడం గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది.ఇలాంటి ఘటనలను మనం చాలానే చూస్తుంటాం కూడా.

 Eight Python Chlings Born Via Artificial Incubation At Karnataka Details, Python-TeluguStop.com

కానీ కర్ణాటకలోని మంగళూరుకు చెందిన పాముల సంరక్షులు.పాము గుడ్లను కృత్రిమంగా పొదిగించారట.

అంతే కాదండోయ్ అవి పిల్లలుగా మారాకా.వాటిని తీస్కెళ్లి అడవిలో వదిలేశారట.

అయితే పాముల సంఖ్య తగ్గిపోవడం, గుడ్డను అనవసరంగా నాశనం చేయడం ఇష్టం లేకే వాళ్లు ఇలా చేశారట.అయితే విషయం చిమ్మించే పాములపై కూడా సంరక్షకులు ప్రేమ చూపించడాన్ని చూసిన స్థానికులు.

వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.అయితే అసలేం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మంగళూరులోని దొంగకేరి సమీపంలో ఉన్న వెంకట రమణ ఆలయానికి ఎదురుగా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.అక్కడ పనులు చేస్తున్న సిబ్బందికి పాము గుడ్లు కనిపించాయి.దీంతో ఇంటి యజమాని షమిత్ సువర్ణ మంచి మనసుతో పాము సంరక్షులకు తెలిపింది.పాము సంరక్షకులు అయిన అజయ్, కిరణ్ లు వచ్చి ఆ గుడ్లను తీస్కెళ్లి… ఇంక్యుబేషన్ విధానంలో గుడ్లు పొదిగే ఏర్పాటు చేశారు.

అవి పిల్లలుగా మారాక వాటిని అడవిలో విడిచి పెట్టారు.అయితే అవన్నీ కొండ చిలువ పిల్లలని.

మొత్తం ఎనిమిది పాములను అడవిలో వదిలినట్లు వెల్లడించారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రతీ ఒక్కరూ పాముల సంరక్షులైన అజయ్, కిరణ్ లను అభినందిస్తున్నారు.

ఇలాంటి వాళ్లు ఉండబట్టే.ప్రకృతి, జీవులు సుఖంగా ఉండగల్గుతున్నాయంటూ ప్రశంసల వెల్లువ కురిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube