నో డైటింగ్...నో ఎక్సర్‌సైజ్..! బరువు తగ్గాలంటే ఈ 8 టిప్స్ పాటిస్తే చాలు..!  

Eight Helath Tips For Weight Loss-

అధిక బరువు సమస్య నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది.తిండి సరిగ్గా తిన్నా, తినకపోయినా చాలా మంది బరువు అధికంగా పెరుగుతున్నారు.

దీనికి కారణాలు అనేకం ఉంటున్నాయి.అయితే కొందరు మాత్రం సరైన డైట్‌ను పాటిస్తూ నిత్యం వ్యాయామం చేస్తున్నప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు.

Eight Helath Tips For Weight Loss--తెలుగు హెల్త్ టిప్స్ ఆరోగ్య సూత్రాలు చిట్కాలు(Telugu Health Tips Chitkalu)-Home Made Receipes Doctor Ayurvedic Remedies Yoga Beauty Etc. -Eight Helath Tips For Weight Loss-

ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వారు చాలా మందే ఉంటున్నారు.కానీ డైటింగ్ చేయకుండా, కసరత్తుల జోలికి వెళ్లకుండా బరువు తగ్గితే.

? సూపర్ గా ఉంటుంది కదా.? అదెలా సాధ్యం అనుకుంటున్నారా.

? ఇప్పుడు మేం చెప్పబోయే కొన్ని టిప్స్ పాటించండి.మీ బరువు కచ్చితంగా అదుపులో ఉంటుంది.

1.ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా పొట్ట నిండుతుంది.

ఆకలి తగ్గడం వల్ల శరీరంలోకి తక్కువ కెలరీలు చేరతాయి.చికెన్ బ్రెస్ట్, చేపలు, గ్రీక్ యోగర్ట్, లెంటిల్స్, క్వినోవా, ఆల్మండ్స్ లాంటి ఆహారంలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.

2.మంచి నీటిని తరచుగా తాగడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం.

భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కొద్దిగా తింటే చాలు పొట్ట నిండుతుంది.

3.

పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల చాలా సేపటి వరకు ఆకలి కాదు.విస్కోస్ ఫైబర్ అనే పీచుపదార్థం బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది.

బీన్స్, ఓట్స్ సెరల్స్, బ్రస్సెల్స్ స్ప్రౌర్ట్స్, ఆస్పరాగస్, నారింజ, అవిసె గింజల్లో ఈ పీచు పదార్థం ఉంటుంది.

4.ఆహారం తీసుకునేటప్పుడు ఆదరాబాదరగా తినొద్దు.మెల్లగా నమిలి తినండి.ఇలా చేయడం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాం.త్వరగా పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది.

5.మితంగా ఆహారం తినే వారితో పోలిస్తే ఎక్కువ మొత్తంలో లాగించే వారు త్వరగా బరువు పెరుగుతారు.

అందుకే కొద్దికొద్దిగా తినండి…ఎక్కువ సార్లు తినండి.

6.

నిద్రలేమి వల్ల లెప్టిన్, ఘెర్లిన్ లాంటి హార్మోన్లపై ప్రభావం పడుతుంది.ఒత్తిడికి లోనైతే కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతోంది.

హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆకలి పెరుగుతుంది, అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు.ఫలితంగా శరీరంలోకి ఎక్కువ కేలరీలు చేరతాయి.

7.తినేటప్పుడు టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటం లాంటి పనులు చేస్తే.

ఎంత తింటున్నామనే ఆలోచన ఉండదు.ఫలితంగా ఎక్కువ తినేస్తాం.

8.షుగరీ డ్రింక్స్ వల్ల శరీరంలోకి ఎక్కువ కేలరీ చేరతాయి.

అందుకే బేవరేజెస్ మానేయడం వల్ల దీర్ఘాకాలికంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.

.

తాజా వార్తలు