ఇవి ఫ్రిడ్జ్ లో పెడితే ఇక విషం కన్నా ప్రమాదం , అవేంటో చూడండి

వేసవి కాలం వచ్చేసింది బయట మండుటెండల మధ్య గడిపి ఇంటికి వస్తే తప్పని సరిగా ఫ్రిడ్జ్ లో పెట్టిన చల్లటి నీళ్లు తాగితేనే ప్రశాంతంగా ఉంటుంది.వేసవి లో చాలా మంది కి ఫ్రిడ్జ్ యొక్క అవసరం ఎక్కువగా ఉంటుంది.

 Eight Foods You Never Store In Fridge , Eight Foods, Fridge, Banans, Bread Pocke-TeluguStop.com

మన ఆహార పదార్థాలను , కూరగాయలని మరియు నీళ్లు పాలు పెరుగు వంటివి చెడిపోకుండా ఉండేందుకు చల్లబడేందుకు ఫ్రిడ్జ్ లో పెడతాం.అయితే కొన్ని కూరగాయలు ఆహార పదార్థాలు మరి కొన్నింటిని ఫ్రిడ్జ్ లో అస్సలు ఉంచకూడదు , వాటి వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు అవేంటో తెలుసుకుందాం.

1.పుచ్చకాయలువేసవిలో చాలా వరకు చల్లగా ఉండేందుకు పుచ్చ కాయలు తింటాం , బయటకి వెళ్ళినపుడు రెండు మూడు తీసుకువచ్చి ఫ్రిడ్జ్ లో పెడతాం.

పుచ్చకాయలని కొస్తే వాటిని ఒక బాక్స్ లేదా గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టండి.అలాగే కోయని పుచ్చకాయలు ఉంటే చల్లదనం కోసం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు.

2.ఉల్లిపాయలుమనం వంటకి సరిపోయే దానికన్నా ఎక్కువ మొత్తం లో ఉల్లిపాయలు కోయడం ద్వారా వాటిని మళ్ళీ వంట చేయడానికి ఉపయోగించాలని వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచుతాం దానివల్ల తగిన ఉల్లిపాయల వాసనతో ఫ్రిడ్జ్ లో ఉండే ఇతర ఆహార పదార్థాల పైన ప్రభావం ఉంటుంది , తరిగిన ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఉండడమే బెటర్.

3.బంగాళదుంపబంగాళాదుంపలను చల్లటి ప్రదేశం లో లేదా ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల అందులో చెక్కర శాతం ఎక్కువగా పెడుగుతుంది.దీనివల్ల కూర లో రుచి అనేది మారుతుంది.వీటిని వంటరూమ్ లోనే ఉంచుకోవడం బెటర్.

4.తేనఎన్ని సంవత్సరాలైన చెడిపోని ఆహార పదార్థం తేనె , దీనిని ఫ్రిడ్జ్ లో అసలు ఉంచకండి దానివల్ల తేనె యొక్క రుచి మారుతుంది.తేనె ని అల్మారాలో లేక ఇంట్లో భద్రమైన ప్రదేశం లో పెట్టుకోవాలి.

5.అరటి పండ్లుఅరటి పండ్లని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అందులో ఉండే ఎంజైమ్స్ తగ్గిపోతాయి ,దీనితో అరటి పండ్లు త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది.అరటి పండ్ల ని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.

6.పువ్వులుపువ్వులని అస్సలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు , వీటి వాసన వల్ల ఫ్రిడ్జ్ లో ఉండే ఇతర ఆహారాల పైన ప్రభావం పడుతుంది, ఆ పుల వాసనతో ఇతర ఆహారాలని మనం తినలేం.

7.పచ్చళ్ళుకాలానికి తగ్గట్లు తెలుగు వారు పచ్చళ్ళు పెడతారు ఇవి చెడి పోకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఫ్రిడ్జ్ లో పచ్చళ్ళు పెట్టడం ద్వారా ఆ చల్లదనాన్ని ఉరగాయలు త్వరగా చెడిపోతుంది.

8.బ్రెడ్మనం బ్రెడ్ పాకెట్ ఓపెన్ చేసాక మిగిలి పోయినది ఫ్రిడ్జ్ లో పెడతాం .దీనివల్ల బ్రెడ్ గట్టి పడి తినలేని స్థితికి వస్తాయి.అందువల్ల కవర్ మూసి పెట్టాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube