నిజంగా మెంటల్ ! ప్రభుత్వానికి ఎనిమిది కోట్ల విరాళం !  

  • ఓ వ్యక్తి భారీ స్థాయిలో విరాళం ఇచ్చి వార్తల్లోకి ఎక్కాడు అంతేనా ఆఖరికి కోర్టు బోను కూడా ఎక్కేసాడు. ఎవరైనా గుళ్ళు గోపురాలకు ఆశ్రమాలకు భారీ మొత్తం లో దానం చేయచ్చు ఫర్వాలేదు కానీ ప్రభుత్వానికి అంత భారీ విరాళం ఇవ్వడం అవసరమా అంటూ అతగాడిని తిట్టిపోస్తున్నారు. ఇంతకీ అతడు మంచిపని కోసమే విరాళం ఇచ్చినా అది కోర్టుకెక్కడంతో అతడి ఆశ తీరలేదు. వివరాలు చుస్తే…

  • Eight Crore Donations To The Government-

    Eight Crore Donations To The Government

  • పాకిస్తాన్‌లో డ్యామ్‌ల నిర్మాణం కోసం ఓ వ్యక్తి రూ.8 కోట్ల విలువైన ఆస్తిని విరాళంగా ఇచ్చాడు. అయితే ఇతడి మానసిక పరిస్థితి సరిగా ఉందో లేదో పరీక్షించాలంటూ పాక్ ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. తమ అంగీకారం లేకుండానే ఆస్తిని ఇచ్చేశారంటూ షేక్ షాహిద్ కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. విచారణ సందర్భంగా భర్తతో సఖ్యంగానే ఉంటున్నారా లేదా అని కోర్టు షాహిద్ భార్యను ప్రశ్నించింది. అయితే ఆయన మానసక పరిస్థితి సరిగా లేదంటూ భార్య, ముగ్గురు కుమారులు కోర్టుకు వెల్లడించారు. దీంతో షరియా చట్టం ప్రకారం సదరు ఆస్తిని విరాళంగా ఇచ్చేసేందుకు కుదరదనీ వారసత్వంగా ఆస్తి ఆయన కుటుంబ సభ్యులకే చెందుతుందని కోర్టు స్పష్టం చేసింది. షాహిద్‌కు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.