#అఖండ..ఎనిమిది ఫైట్స్ తో సూపర్ ట్రీట్ ఇవ్వబోతున్న బాలయ్య!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ‘ సినిమా చేస్తున్నాడు.బోయపాటి సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Eight Action Fights In Balayya Akhanda Movie, Eight Action Fights, Balakrishna,-TeluguStop.com

హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో బోయపాటి ముందు వరుసలో ఉంటాడు.అఖండ సినిమా టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది ఈ సినిమా కూడా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు అని.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Fights, Fightsbalayya, Jaga Path Ba

ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి అభిమానులు అంతా ఎదురు చూస్తున్నారు.తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ సినిమా రాబోతున్న ఫైట్స్ గురించే ఈ చర్చ అంతా.ఒకటి కాదు రెండు కాదు ఈ సినిమాలో ఏకంగా ఎనిమిది ఫైట్స్ ఉన్నాయట… అవి కూడా వేటికవే ప్రత్యేకంగా తీర్చుదిద్దుతున్నాడని సమాచారం.

బాలయ్యను సింహా, లెజెండ్ సినిమాల్లో ఎంత పవర్ ఫుల్ రోల్స్ లో చూపించాడో అంతకుమించి ఈ సినిమాలో బోయపాటి చూపించ బోతున్నాడట.ఇక ఫైట్స్ విషయానికి వస్తే.

ఈ సినిమాలో మొత్తం 8 ఫైట్స్ ఉండగా అందులో ఇంటర్వెల్ లో వచ్చే ఫైట్ ను బోయపాటి వీటన్నిటి కంటే ప్రత్యేకంగా డిజైన్ చేసాడట.ఈ సినిమాలో ఒక విజువల్ ఫీస్ట్ ను అందించడానికి బోయపాటి చాలా కష్టపడుతున్నాడట.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Fights, Fightsbalayya, Jaga Path Ba

ఇక ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు.అంతేకాదు జగపతిబాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత కూడా బోయపాటి వరుస సినిమాలను సిద్ధం చేసుకున్నాడు.అఖండ పూర్తి అయినా వెంటనే బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా ఆ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube