కడుపు నొప్పి అని ఆసుపత్రికి వెళ్తే ...చివరికి ..?

చిన్న పిల్లలు అంటే వారికి తెలియదు కాబట్టి ఏవి పడితే వాటిని నోటిలో పెట్టుకుని మింగేస్తూ ఉంటారు.కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని చాలామంది రకరకాల ప్రయత్నాలు చేసి అవి వికటించడంతో ఆసుపత్రి పాలవుతున్నారు.

 Egypt Doctors Found Cell Phone In Stomach Of A Man, Stomach Pain, Latest News,mo-TeluguStop.com

ఏది పడితే అది తినేస్తున్నారు.ఇసుక, మట్టి, వెంట్రుకలు, రాళ్లు, ట్యూబ్ లైట్స్ ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఏకంగా సెల్ ఫోన్ మింగేశాడు.ఈ విచిత్రమైన సంఘటన ఈజిప్ట్‌ దేశంలో జరిగింది.

అతను ఫోన్ మింగిన తరువాత సహజంగానే కడుపులో నుంచి బయటకు వస్తుందనే ఆలోచనలో ఉండి పట్టించుకోలేదు.

కానీ ఆరునెలల తరువాత ఉన్నట్టుంది తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్లి వైద్యుడిని సంప్రదించాడు.

ఆ వ్యక్తిని పరీక్షించిన వైద్యులు అతనికి కడుపు ఎక్స్ రే తీయగా ఒక్కసారిగా ఆ స్కాన్ రిపోర్ట్ చూసి అవాక్కయ్యారు.ఆ వ్యక్తి కడుపులో మొబైల్‌ ఫోన్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

ఆరు నెలల క్రితం అతను పొరపాటున ఫోన్‌ను మింగిన్నట్లు వైద్యులకు తెలిపాడు.ఆ మొబైల్ ఫోన్ సహజంగా బయటకు వస్తుందని అతని భావించి ఆ విషయాన్నీ అంత సీరియస్ గా తీసుకోలేదు.

కానీ ఆ మొబైల్‌ కడుపులో ఇరుక్కొని ఆహారం జీర్ణం కాకుండా అడ్డుకోవడంతో అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు.

Telugu Aswan, Docter, Egypt Doctors, Egypt, Latest, Phone, Shocked, Stomach Pain

ఈజిప్టులోని అస్వాన్ నగరంలో ఉన్న ఆసుపత్రి వైద్యులు ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని అతనికి ఆపరేషన్ చేసి మొబైల్‌ ఫోన్ ను బయటకు తీశారు.ప్రస్తుతం అతను పరిస్థితి బాగానే ఉంది.ఆ వ్యక్తి అదృష్టం బాగుండి ఆ ఫోన్ కడుపులో పేలలేదు.

అలా కనుక జరిగి ఉంటే అతని ప్రాణానికే ప్రమాదకరం అయ్యేది.కాగా మింగేసిన ఫోన్ మూడు భాగాలుగా విడిపోయిందట.

ఎట్టకేలకు వైద్యులు అతి కష్టం మీద ఆపరేషన్ చేసి ఫోన్ బయటకు తీసి అతని ప్రాణాలను కాపాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube