మహేష్ అంటే భయం లేదు అంటున్న అల్లు అర్జున్   Ego War Started Between Mahesh Babu And Allu Arjun     2017-10-30   02:09:14  IST  Raghu V

బాక్సాఫీస్ బరిలో పెద్ద సినిమాల పోటి చాలా కామన్ అయిపొయింది. అసలు పోటి లేకుండా సినిమాలు విడుదల అవడం లేదు. ఎంత పెద్ద హీరో ఉన్నా, తమ మార్కెట్ స్థాయి పట్టింపులు లేకుండా, కథలో బలం ఉందని అనిపిస్తే చాలు పోటిలోకి దిగుతున్నారు. శర్వానంద్ ఈ విషయంలో అందరికి ఉదాహరణగా నిలుస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ సినిమా అంటే లెక్కకు మించి హైప్ ఉంటుంది, దానికి తగ్గట్టే పెద్ద రిలీజ్ ఉంటుంది. కాని అవేమి ఆలోచించకుండా, అనుష్క భాగమతి, రాజ్ తరుణ్ రాజుగాడు, వీటితో పాటు మరో పెద్ద సినిమా జయసింహ (బాలకృష్ణ) అజ్ఞాతవాసితో పాటు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి.

ఇక ఏప్రిల్ ఎప్పటినుంచి తెలుగు బాక్సాఫీస్ కి మంచి సీజన్. ఎన్నో బ్లాక్బస్టర్స్, పోకిరి, బాహుబలి 2 లాంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఇదే సీజన్ లో వచ్చాయి. అల్లు అర్జున్ కూడా తన సినిమాలని ఏప్రిల్ లోనే విడుదల చేసుకుంటూ ఉంటాడు. కాని ఈసారి బన్ని సోలోగా రావట్లేదు. ఒకేరోజు భరత్ అనే నేను, నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా సినిమాలు విడుదల అవుతున్నాయి. ఏప్రిల్ 27ని విడుదల తేదిని ముందుగా అల్లు అర్జున్ ప్రకటించినా, అదేరోజు సినిమా వస్తున్నట్లు మహేష్ వర్గాలు చెప్పేశారు. బన్ని తన సినిమా విడుదల ప్లాన్ మార్చుకుంటాడని అనుకున్నారు వీళ్ళు. కాని అలా జరగలేదు.

మహేష్ టీమ్ రిలీజ్ డేట్ ప్రకటించిన మరుసరి రోజే నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా నిర్మాతలు మా సినిమా తప్పకుండా ఏప్రిల్ 27న వస్తోందని, విడుదల తేదిని మార్చడం లేదని చెప్పేశారు. మేం కూడా తగ్గేది లేదని, మహేష్ టీం నిన్నటి రోజు మళ్ళీ విడుదల తేదిని కన్ఫర్మ్ చేసింది. ఇలా విడుదలకి ముందే, పోటి మొదలుపెట్టేసారు. మరి అసలు పోటిలో విజేతలు ఎవరో చూడాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.