హీరో నాని - సుధీర్ కి మధ్య ఈగో వార్ నడుస్తుందా.... !  

Ego War Is Going On Between Hero Nani And Sudheer Babu - Telugu Nani, Nani Movie News, Sudheer Babu Latest News, Sudheer Babu Movie Latest News, Sudheer Babu News, Tollywood News, V Movie Latest News, V Movie News

టాలీవుడ్ లో దాదాపుగా ఎక్కువ శాతం సక్సెస్ రేటు ఉన్న దర్శకులలో మోహన కృష్ణ ఇంద్రగంటి ఒకరు.అయితే తాజాగా మోహన్ కృష్ణ “వి” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Ego War Is Going On Between Hero Nani And Sudheer Babu

ఈ చిత్రంలో  న్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరో, విలన్ గా నటిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందనే వచ్చింది.

అంతేగాక ఈ చిత్ర ట్రైలర్ విడుదలైన ఒక్క రోజులోనే 4 మిలియన్ల పై చిలుకు వ్యూస్ వచ్చాయి.

అయితే తాజాగా విడుదలైన టువంటి ఈ చిత్ర ట్రైలర్ ను ఒకసారి పరిశీలిస్తే ఇందులో హీరో నాని విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

అంతేగాక సుధీర్ బాబు ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈచిత్రంలో వీరిద్దరి మధ్య పెద్ద వార్ జరుగుతున్నట్లు, మరియు విలన్ నాని ని పట్టుకునేందుకు సుధీర్ బాబు తీవ్రంగా ప్రయత్నిస్తూ చివరికి పట్టుకున్నాడా లేదా అనే సస్పెన్స్ థ్రిల్లర్ మధ్య వస్తోంది ఈ చిత్రం.

ముఖ్యంగా నాని మరియు సుధీర్ ల మధ్య జరిగే ఛాలెంజ్ సన్నివేశాలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఇందులో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఈగో ని టచ్ చేస్తే ఎలా ఉంటుందో దర్శకుడు చూపించినట్లు తెలుస్తోంది.

అయితే ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఈ చిత్రంలో నివేదా థామస్ మరియు అదితీరావులు నటించారు.దీంతో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా సాగే ఈ చిత్రం కోసం ఇటుపక్క నాని అభిమానులు అటుపక్క సుధీర్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలు కీలక సన్నివేశాలు కూడా పూర్తయినట్లు సమాచారం. అంతేగాక దర్శకుడు మోహన్ క్రిష్ణ ఈ చిత్రాన్ని మార్చి 25వ తారీఖున విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

Ego War Is Going On Between Hero Nani And Sudheer Babu-nani Movie News,sudheer Babu Latest News,sudheer Babu Movie Latest News,sudheer Babu News,tollywood News,v Movie Latest News,v Movie News Related....