ముడతల చికిత్సలో గుడ్డు తెల్లసొన ఎలా సహాయాపడుతుందో తెలుసా?       2018-05-23   01:10:36  IST  Lakshmi P

వయస్సు పెరిగే కొద్దీ ముడతలు,సన్నని గీతలు వంటివి రావటం సహజమే. అలాగే వృద్దాప్య ఛాయలు కూడా వయస్సు పెరిగే కొద్దీ వస్తాయి. ఈ సమస్యల నుండి బయట పడటానికి ఖరీదైన పద్దతులను ఉపయోగించవలసిన అవసరం లేదు. ఎందుకంటే గుడ్డు తెల్లసొనను ఉపయోగించి సమర్ధవంతంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు గుడ్డు తెల్లసొనను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

తేనెలో గుడ్డు తెల్లసొన కలిపి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వలన చర్మం తేమగా,ఉత్తేజంగా,బిగుతుగా ఉంటుంది.

పెరుగులో గుడ్డు తెల్లసొనను కలిపి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వలన చర్మం కాంతివంతంగా మారటమే కాకుండా యవన్నంగా మారుతుంది.

ఒక గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ ఓట్ మీల్ వేసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఒక గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన ముఖం మీద ఉన్న నల్లని మచ్చలు తొలగిపోవటమే కాకుండా చర్మం బిగుతుగా మారుతుంది.