జుట్టు పెరుగుదలకు సమర్ధవంతమైన ఎగ్ హెయిర్ పాక్స్       2018-04-27   02:14:48  IST  Lakshmi P

ప్రతి ఒక్కరు జుట్టు పొడవుగా ఒత్తుగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. తక్కువ ఖర్చుతో గుడ్డుతో హెయిర్ పాక్స్ వేసుకుంటే జుట్టు పొడవుగా పెరుగుతుంది. గుడ్డులో ఉండే సహజమైన ప్రోటీన్స్, నూనెలు జుట్టు వేగంగా పెరగటానికి సహాయపడతాయి. సెలూన్ కి వెళ్లి ప్రోటీన్ కండీషనింగ్ ట్రీట్మెంట్ తీసుకొనే బదులు ఇంటిలో ఇప్పుడు చెప్పే గుడ్డు పాక్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

గుడ్డు పచ్చసొన,ఆలివ్ ఆయిల్ రెండు స్పూన్ల గుడ్డు సొనలో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించి రెండు గంటల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. షాంపూ అయ్యాక కండిషనర్ రాయాలి. ఇలా వారంలో ఒకసారి చేయాలి. అప్పుడు జుట్టు మృదువుగా ఉండటమే కాకుండా ఒత్తుగా పెరుగుతుంది.

గుడ్డు పచ్చ సొన,తేనే రెండు స్పూన్ల పచ్చసొనలో రెండు స్పూన్ల తేనే కలిపి బాగా కలిపి జుట్టుకు పట్టించి రెండు గంటల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. తేనే జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు పెరగటానికి దోహదం చేస్తుంది. వారానికి ఒకసారి కొన్ని వారాల పాటు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.

గుడ్డు పచ్చసొన,పెరుగు పావు కప్పు పెరుగులో ఒక గుడ్డు పచ్చసొన కలిపి బాగా కలిపి జుట్టుకు పట్టించి రెండు గంటల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి. షాంపూ అయ్యాక కండిషనర్ రాయాలి. ఇలా వారంలో ఒకసారి చేయాలి.