వామ్మో గుడ్డు : ఆరోగ్యంకు మంచిదని గుడ్డు తినే వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం  

Egg Is Not A Healthy Food-healthy Food,heart,pregnant,గర్బవతి,గుడ్లు

గర్బవతిగా ఉన్న సమయంలో మహిళలు రోజుకు కనీసం ఒక్క గుడ్డు అయినా తినాలని వైధ్యులు పెద్దలు సూచిస్తూ ఉంటారు. కాని అసలు విషయం ఏంటీ అంటే వారంలో నాలుగు గుడ్ల కంటే ఎక్కువ తినడం ఏమాత్రం మంచిది కాదని పరిశోదనలో వెళ్లడయ్యింది. గర్బవతులు మాత్రమే కాకుండా పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా వారంలో మూడు లేదా నాలుగు గుడ్ల కంటే ఎక్కువ తినవద్దని ఆ పరిశోదన నిర్వహించిన శాస్త్రవేత్తలు అంటున్నారు..

వామ్మో గుడ్డు : ఆరోగ్యంకు మంచిదని గుడ్డు తినే వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం-Egg Is Not A Healthy Food

ముఖ్యంగా పిల్లలు వారంలో మూడు గుడ్లకు ఎక్కువ తీసుకోవద్దట. అలా ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతుందని అంటున్నారు.

ఏదైన అతి మంచిది కాదనే విషయం అందరికి తెల్సిందే.

అతిగా ఏది తీసుకున్నా కూడా వెగటు అవుతుంది. ఆ విషయం గుడ్ల విషయంలో కూడా తాజాగా నిర్వహించిన పరిశోదనల్లో వెళ్లడయ్యింది. గుడ్లను అధికంగా తీసుకోవడం వల్ల కొవ్వు పెరిగి గుండెకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వస్తాయని ఈ సందర్బంగా అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు నిరూపించారు.

తాజాగా వీరు దాదాపు 30 వేల మందిపై ఒక ప్రయోగం చేశారు. అందులో గుడ్లు తీసుకునే వారు కొందరు అవ్వగా, గుడ్లు అస్సలు తీసుకోని వారు కొందరు. ఇక ప్రతి రోజు గుడ్లను తినే వారిని కూడా ఈ ప్రయోగం కోసం ఎంపిక చేయడం జరిగింది.

ఆ 30 వేల మందిని దాదాపు ఆరు నెలల పాటు పరిశీలించిన తర్వాత అనూహ్యమైన ప్రయోగ ఫలితాలు వెలువడ్డాయి. ఆ పలితాలు ప్రస్తుతం గుడ్లు తినే వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

గుడ్లు అధికంగా తినే వారిలో గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా ప్రత్యక్షంగా ప్రయోగంలో వెళ్లడయ్యింది. గతంలో చేసిన ప్రయోగాల్లో గుడ్డు ఆరోగ్యానికి మంచిదే అని తేలింది. కాని ఇప్పుడు మారిన పరిస్థితులు మరియు ఇతరత్ర కారణాల వల్ల గుడ్లు ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని వెళ్లడయ్యింది..

ముఖ్యంగా అధికంగా గుడ్లను తినే వారు భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రయోగం చేసిన వారు అంటున్నారు.