కోడిగుడ్డు + పెరుగుతో చుండ్రుకు గుడ్ బై....ఎలాగో తెలుసా?  

Egg And Yogurt Hair Mask For Dandruff -

చుండ్రు సమస్య వచ్చిందంటే ఒక పట్టాన వదలదు.ఎన్నో రకాల షాంపూలను ఉపయోగిస్తాం.

తాత్కాలికంగా తగ్గుతుంది.ఆ తరవాత మళ్ళీ చుండ్రు సమస్య మొదలు అవుతుంది.

కోడిగుడ్డు + పెరుగుతో చుండ్రుకు గుడ్ బై….ఎలాగో తెలుసా-Telugu Health-Telugu Tollywood Photo Image

అంతేకాకుండా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.మనకు అందుబాటులో ఉండే పెరుగు,కోడిగుడ్డును ఉపయోగించి చుండ్రు సమస్యను చాల సులభంగా తగ్గించుకోవచ్చు.

కోడిగుడ్డు + పెరుగు చుండ్రు సమస్య నుండి ఎలా తగ్గిస్తాయో వివరంగా తెలుసుకుందాం.

పెరుగు

పెరుగులో ఉండే సహజ కొవ్వులు మాడును తేమగా ఉంచి పొడిగా మారకుండా చేస్తాయి.దాంతో దురద తగ్గుతుంది.దురద తగ్గితే చుండ్రు కూడా తగ్గుముఖం పడుతుంది.పెరుగులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు తల మాడుపై దురదకు కారణం అయిన కారకాలను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.

గుడ్డు

గుడ్డులో సహజసిద్ధమైన ప్రోటీన్స్ ఉండుట వలన చుండ్రు తగ్గించటంలో సహాయపడుతుంది.అంతేకాక జుట్టు రాలకుండా బలంగా పెరగటానికి కూడా సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి

ఒక కప్పు పెరుగులో ఒక గుడ్డు కలిపి తలకు పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు.చుండ్రు సమస్యను పరిష్కరించటంలో కోడిగుడ్డు,పెరుగు చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు