నేటి ఆధునిక కాలంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు.శరీరానికి ఆహారం, ఊపిరి ఎంత ముఖ్యమో.
నిద్ర కూడా అంతే ముఖ్యం.కానీ, అలాంటి నిద్రను నిర్లక్ష్యం చేస్తూ నేటి కాలంలో టీవీ చూడటం, స్మార్ట్ ఫోన్స్‌లో గేమ్స్ ఆడటం, చాటింగ్ చేయడం ఇలానే టైమ్ గడిపేస్తున్నారు.
పూర్వ కాలంలో రాత్రి ఎనిమిది అయిందంటే అన్ని పనులు పూర్తి చేసుకుని నిద్రపోయేవారు.కానీ, ఈ రోజుల్లో పన్నెండు అయినా నిద్రపోవడం లేదు.
ఉదయం పదింటి వరకు నిద్ర లేవడం లేదు.
ఈ పద్ధతి ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలిసినప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు.
అయితే నైట్ లేట్‌గా నిద్ర పోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సాధారణంగా మెదడు చురుగ్గా పని చేయాలన్నా, ఏ పనిపైన అయినా ఏకాగ్రత పెరగాలన్నా నిద్ర చాలా అవసరం.
అయితే, రాత్రి వేల ఆలస్యంగా పడుకోవడం వల్ల మెదడు పని తీరు మందగించడంతో పాటుగా ఏకాగ్రత కూడా లోపిస్తుంది.అలాగే నైట్ టైమ్ లేట్‌గా నిద్రిస్తే.
ఒత్తిడి, తలనొప్పి, డిప్రెషన్ వంటి సమస్య వచ్చే రిస్క్ అత్యధికంగా ఉంటుంది.
ఇక శరీరం ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండాలంటే రోజంతా అలసిన శరీరానికి తగినంత విశ్రాంతి చాలా అవసరం.అలా కాకుండా.రోజంతా అలసిపోయి మళ్లీ ఇంటికి వచ్చి ఫోన్లతో, టీవీలతో కూర్చుని నిద్రను నిర్లక్ష్యం చేస్తే చివరకు నిద్రలేమికి దారి తీస్తుంది.ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాగే లేట్ నైట్ పడుకోవడం వల్ల మధుమేహం వచ్చే రిస్క్ పెరగడం, గుండె జబ్బుల బారిన పడటం, జ్ఞాపక శక్తి లోపించడం, అధిక బరువు, మానసిక ఒత్తిడి ఇలా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అందువల్ల, నిద్రను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా.
సరైన సమయానికి నిద్రించాలని సూచిస్తున్నారు.