మిగిలిన సమయాలతో పోలిస్తే ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యంగా తీసుకునే ఆహార విషయంలో అనేక నియమాలు పాటించాల్సి ఉంటుంది.
అయితే గర్భం దాల్చిన చాలా మంది స్త్రీలు జంక్ ఫుడ్ తినడానికి తెగ ఇష్టపడుతుంటారు.హెల్త్‌కు మంచిది కాదని తెలిసినా.
నోరు కట్టుకోలేకపోతుంటారు.కానీ, గర్భిణీ స్త్రీలు జంక్ ఫుడ్ ను ఎట్టిపరిస్థితుల్లో తీసుకోరాదని నిపుణులు చెబుతున్నారు.
అసలు ప్రెగ్నెన్సీ సమయంలో జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటీ.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జంక్ ఫుడ్ తినడానికి ఎంతో రుచిగా ఉన్నప్పటికీ.అందులో ఎటువంటి పోషకాలు ఉండవు.పైగా కొన్ని రకాల జంక్ ఫుడ్స్‌లో షుగర్స్ చాలా అధికంగా ఉంటాయి.అందు వల్ల, గర్భం దాల్చిన వారు అటు వంటి వాటిని తీసుకుంటే మధుమేహం బారిన పడే అవకాశం ఉంటుంది.
అలాగే గర్భిణీ స్త్రీలు జంక్ ఫుడ్‌ను ఓవర్ గా తీసుకోవడం వల్ల.పుట్ట బోయే బిడ్డలకు మెదడు, ఊపిరితిత్తులు, ఎముకలు, గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ ఉంటుంది.
మరియు కడుపులోని బిడ్డ ఎదుగు దలపై సైతం ప్రభావం పడుతుంది.ఆ కారణంగానే.
ఆరోగ్యమైన, తెలివైన పిల్లలు పుట్టాలనుకునే తల్లులు ఖచ్చితంగా జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
జంక్ ఫుడ్ తయారీలో ఉప్పును అధిక మొత్తంలో యూజ్ చేస్తుంటారు.దాంతో గర్భిణీ స్త్రీలు జంక్ ఫుడ్‌ను తరచూ తీసుకుంటే రక్త పోటు స్థాయిలు అదుపు తప్పుతాయి.ఫలితంగా నానా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.
ఇక ప్రెగ్నెన్సీ సమయంలో జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల బరువు మరింత పెరిగి పోతారు.దాని వల్ల ప్రసవ సమయంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కాబట్టి.గర్భిణీలు జంక్ ఫుడ్‌ను ఎంత ఎవైడ్ చేస్తే పుట్టబోయే బిడ్డకు, తల్లికి అంత మంచిది.