స్వీట్స్.పేరు వింటేనే చాలా మందికి నోరూరుతుంటుంది.వీటిని పిల్లలే కాదు పెద్దలు సైతం అమితంగా ఇష్టపడుతుంటారు.దాంతో స్వీట్లు కనపడితే చాలు తెగ లాగించేస్తుంటారు.అయితే స్వీట్లు తినడానికి రుచిగా ఉన్నప్పటికీ.ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు.
స్వీట్లను షుగర్‌తో తయారు చేస్తారు.అందు వల్ల, వీటిని అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతారని అందరూ భావిస్తారు.
కానీ, బరువు పెరగడమే కాదు.అనేక అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
ముఖ్యంగా స్వీట్స్‌ను పరిమితికి మించి తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుంది.దాంతో తరచూ ఏదో ఒక జబ్బుకు గురవుతూ ఉంటారు.అలాగే స్వీట్స్‌ను ఓవర్‌గా తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, బద్ధకం వంటి సమస్యలను తరచూ ఎదుర్కోవాల్సి ఉంటుంది.చర్మ సౌందర్యాన్ని దెబ్బ తీయడంలో స్వీట్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
అవును, అతిగా స్వీట్స్‌ను తీసుకుంటే చర్మం జిడ్డుగా మారిపోవడం, మొటిమలు, ముడతలు వంటి సమస్యలు తరచూ ఇబ్బంది పెడతాయి.పైన చెప్పుకున్నట్టు స్వీట్లను పంచదారతో తయారు చేస్తారు.
అందు వల్ల, వీటనిని అధికంగా తీసుకుంటే రక్త పోటు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.దాంతో మీరు హైబీపీ బారిన పడతారు.
అంతేకాదు, స్వీట్స్‌ను అడ్డు అదుపు లేకుండా తీసుకుంటే కీళ్ల నొప్పులు, వాపులు పెరిగి పోతాయి.దంతాల ఆరోగ్యం దెబ్బ తింటుంది.శరీరంలో అదనపు కొవ్వు పేరుకు పోయి బరువు భారీగా పెరుగుతారు.లివర్ ఆరోగ్యం పాడవుతుంది.అలసట, నీరసం వంటి సమస్యలు ఎక్కువవుతాయి.ఏకాగ్రత లోపిస్తుంది.
ఇలా ఎన్నో జరుగుతాయి.అందుకే స్వీట్స్‌ను తినడం తగ్గించండి.
లేదు, నేను స్వీట్లను తినడం మానను అనుకునే వారు బెల్లంతో తయారు చేసిన స్వీట్లను తీసుకోవడం మేలు.అందులోనూ నల్ల బెల్లంతో తయారు చేసిన స్వీట్స్ అయితే హెల్త్‌కి ఇంకా మంచిది.