మలబద్ధకం సమస్యకి ఇవిగో చిట్కాలు  

Effective Remedies For Constipation-

English Summary:Express out one suffers from constipation problems. Pre-litter properly, trouble all day, unable to suffer because of a strained stomach Nana.Suggestions that it seemed difficult to make out, it seemed difficult to go up to the doctor, do not worry. There are tips that you need madaggara.

* Breakfast, lunch and dinner, eat a certain time. Eating at a certain time every day, it will be easier to excrete.

* Fiber much-needed fruits and vegetables to eat. Jamakaya, as is the lettuce.

* Ensure that the yogurt rice. Like the liquid ingredients.As soon as the result of rising early in the morning on an empty stomach will drink a little warm water. Herbal tea, lemon juice and serve.

* Regular exercise will avoid the problems of litter.

* Amount of practice early in the morning drinking coffee, it will be easier to excrete.But remember, only drink doses practice. ...

బయటకి చెప్పుకోవడానికి ఇబ్బందిపడే సమస్యల్లో మలబద్ధకం ఒకటి. మలవిసర్జన సరిగా జరగక, రోజంతా ఇబ్బంది పెడుతున్న కడుపుతో నానా తంటాలు పడుతుంటారు జనాలు. బయటకి చెప్పి సలహాలు తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపించినా, డాక్టర్ దగ్గరకి వెళ్ళడానికి ఇబ్బందిగా అనిపించినా, ఏం పర్లేదు...

మలబద్ధకం సమస్యకి ఇవిగో చిట్కాలు -

మీకు అవసరమైన చిట్కాలు మాదగ్గర ఉన్నాయి.* బ్రేక్‌ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ నిర్దిష్ట సమయానికి తినాలి. నిర్దిష్ట సమయంలో ప్రతిరోజు తినడం వలన మలవిసర్జన సులభంగా అవుతుంది.

* ఫైబర్ ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు తినాలి. జామకయ, పాలకూర లాంటివి అన్నమాట.* అన్నంలో పెరుగు ఉండేలా చూసుకోండి.

అలాగే ద్రవ పదార్ధాలను ఇష్టపడండి. ఉదయాన్నే లేచిన వెంటనే ఖాళీ కడుపుతో కొంచెం వెచ్చని నీటిని తాగితే ఫలితం కనిపిస్తుంది. హెర్బల్ టీ, నిమ్మరసం ఉపయోగపడతాయి.

* క్రమం తప్పని వ్యాయామం మలవిసర్జన సమస్యలను దూరం చేస్తుంది.* పద్ధతిగల మోతాదులో ఉదయాన్నే కాఫీ తాగితే, మలవిసర్జన సులభం అవుతుంది. కాని గుర్తుపెట్టుకోండి, పద్ధతిగల మోతాదులో మాత్రమె తాగాలి.