అజీర్తి.వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని బాధ పెట్టే కామన్ సమస్య ఇది.జీర్ణ వ్యవస్థ పని తీరు నెమ్మదించడం వల్ల అజీర్తి ఏర్పడుతుంటుంది.ఇది ఎప్పుడో ఒక సారి వస్తే పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు.
కానీ, కొందరు తరచూ అజీర్తితో సతమతం అవుతుంటారు.ఇలాంటి వారు ఏం తినాలన్నా, తాగాలన్నా తెగ భయపడి పోతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే ఇక లైఫ్‌లో అజీర్తి అన్న సమస్యే ఉండదు.మరి లేటెందుకు అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ మెంతులు, రెండు స్పూన్ల వాము, రెండు స్పూన్ల జీలకర్ర, ఒక స్పూన్ సోంపు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు చిన్న మంటపై వేయించుకోవాలి.ఆ తర్వాత వీటన్నిటినీ చల్లారబెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియన్స్‌తో పాటుగా ఒక టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు, ఒక స్పూన్ ఇంగువ, రెండు చిన్న పటిక బెల్లం ముక్కలు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

ఆపై ఈ పొడిని గాలి చొరబడని ఒక డబ్బా లో నింపుకుంటే.పది నుంచి పదిహేను రోజుల పాటు వాడుకోవచ్చు.ఇక ఈ పొడిని ఎలా యూజ్ చేయాలీ అంటే.
ప్రతి రోజు భోజనం చేయడానికి గంట ముందు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ పొడిని కలుపుకుని సేవించాలి.ఇలా చేస్తే జీర్ణ వ్యవస్థ పని తీరు చురుగ్గా మారి అజీర్తి సమస్య ఏర్పడకుండా ఉంటుంది.
మరియు గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలన్నిటికీ ఎల్లప్పుడూ దూరంగా ఉండొచ్చు.
