నోటి అల్సర్స్ కోసం పరిష్కార మార్గాలు  

Effective Home Remedies For Mouth Ulcers-

నోటి అల్సర్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి.నొప్పిని కలిగిస్తూ, ఏ మాత్రం కారం తగిలినా భరించలేకుండా చేస్తాయి.ఒక్కోసారి మాట్లాడటం కష్టమైపోతుంది, ఆహారాన్ను నమలడం కష్టమైపోతుంది..

Effective Home Remedies For Mouth Ulcers---

దాంతో నలుగురిలో తిరగాలన్నా ఇబ్బందే, నలుగురితో మాట్లాడాలన్నా ఇబ్బందే! ఇంతలా బాధపెట్టే ఈ నోటి అల్సర్స్ కోసం ఎక్కడికో హాస్పిటల్ దాకా వెళ్ళాల్సిన పని లేదు.ఇంట్లోనే వైద్యం చేసుకోవచ్చు.* తేనే నోటిలో కరువైన మాయిశ్చర్ ని తిరిగి తీసుకువస్తుంది.

దీంట్లో ఉండే యాంటిఆక్సిడెంట్స్, యాంటి మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఇంఫెక్షన్ ని అక్కడే ఆపేసి, అల్సర్ ని చంపేస్తాయి.* కలబందలో యాంటిసెప్టిక్, యాంటి బ్యాక్టీరియల్ , యాంటి ఫంగల్, యాంటి వైరల్ ప్రాపర్టీస్ అన్ని ఉంటాయి.అందుకే దీన్ని ప్రకృతి అందిన దివ్యౌశధంగా చెప్పుకోవచ్చు.

నోటి అల్సర్స్ నుంచి తక్షణమే రిలీఫ్ అందించగలదు కలబంద.* తులసి ఆకులు కూడా మౌత్ అల్సర్స్ పై ప్రభావం చూపుతాయి.ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ అల్సర్ పై ఫైట్ చేస్తాయి.

* బేకింగ్ సోడా కూడా మౌత్ అల్సర్స్ పై పనిచేస్తుంది.ఇందులో దొరికే సోడియం బైకార్బోనేట్ ఉండటం వలన ఇది అల్సర్స్ పై పనిచేస్తుంది.అయితే ఇది వాడటం వలన కొంత మంటగా కూడా అనిపించవచ్చు.

కాబట్టి మీ వీలుని బట్టి వాడండి.* పసుపు గురించి కొత్తగా చెప్పేదేముంది.ఇందులో ఉండే యాంటిసెప్టిక్, యాంటిమైక్రోబియల్ లక్షణాలు మంటను తగ్గించి, నోటిని చల్లబర్చి, మెల్లిగా అల్సర్ ని పోగొడుతుంది.

* కొబ్బరిని జ్యూస్ లాగా చేసుకోని కూడా అల్సర్స్ పై అప్లై చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.* కొత్తిమీరలో విటమిన్ సి ఎక్కువ.అందుకే ఇవి అల్సర్స్ ని త్వరగా పొగొడతాయి.