పెదాలు పగిలితే ఏం చేయాలి ?  

Effective Home Remedies For Dry And Cracked Lips -

అప్పుడే చలికాలం వచ్చేసింది.తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం పూట 20 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఈ చలికాలం మోసుకొచ్చే సమస్యల్లో ఓ ప్రాధానమైన సమస్య పెదాలు పగలడం.కొన్నిసార్లు ఈ సమస్య నొప్పిని తీసుకొస్తుంది.

Effective Home Remedies For Dry And Cracked Lips -Effective Home Remedies For Dry And Cracked Lips - -Telugu Health-Telugu Tollywood Photo Image

కొందరికి రక్తస్రావం కూడా జరుగుతుంది.కాని సాధారణంగా మాత్రం, పెదాల చుట్టూ చర్మం చచ్చిపోయినట్లు ఉండి, చూడడానికి అంతగా బాగుండదు.

ఈ సమస్య ఇప్పటినుంచి మొదలు మరో మూడు నెలల వరకు మిమ్మల్ని వెంటాడవచ్చు.మరి ఈ సమస్యకు చికిత్స ఇంట్లో లేదా అంటే ఉంది, కేవలం లిప్ బామ్స్ మీద ఆధారపడటమే కాదు, సహజ వనరులతో కూడా పగిలిన పెదాలను సరిచేసుకోవచ్చు.

* ద్రవ పదార్థాలు తాగుతూ ఉండాలి.లిప్స్ డ్రై అవకుండా ఉండటానికి ఇదో మంచి మార్గం.

* తేనే, రోజ్ వాటర్ కలిపి ఓ మిశ్రమంలా తయారు చేసుకొని, పెదవులకి పట్టాలి.ఇలా రోజుకి రెండుసార్లు చేసుకుంటే చాలు.

* స్వచ్చమైన తేనే దొరకాలే కాని, అసలు ఏ రకమైన లిప్ బామ్ కాని, కెమికల్ కాని అవసరం లేదు.సింపుల్ గా ఆర్గానిక్ తేనే పెదాలకి రాయండి సరిపోతుంది.

* నిమ్మరసం కూడా పగిలిన పెదాలకి పాతరూపం తీసుకువస్తుంది.

* కలబందకి నేచురల్ మాయిశ్చరైజర్ అనే పేరు ఉంది.

కాబట్టి కలబందని అద్దుతూ ఉండండి.

* గ్రీన్ టీ బ్యాగ్, మిల్క్ క్రీమ్, కోకోనట్ ఆయిల్, కీరదోస కూడా మీ పగిలిన పెదాల్ని బాగుచేస్తాయి.

తాజా వార్తలు