చర్మంపై దురద,వాపు తగ్గటానికి అద్భుతమైన చిట్కాలు     2018-07-18   10:54:12  IST  Laxmi P

మన శరీరంలో అతి పెద్ద అవయవం చర్మం. చర్మం మన శరీరాన్ని ఎండ,వాన నుండి కాపాడుతుంది. చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అటువంటి చర్మాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యత మనకు ఉంది. చర్మానికి సరైన సంరక్షణ తీసుకోకపోతే కొన్ని రకాల సమస్యలు వచ్చి దురద,వాపు,మంట వంటివి వస్తాయి. ఆ సమస్యల నుండి బయట పడటానికి కొన్ని వంటింటి చిట్కాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

కలబంద

కలబందలో ఉండే లక్షణాలు మంట,వాపును తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రభావిత ప్రాంతంలో కొంచెం కలబంద జెల్ రాయాలి. మార్కెట్ లో దొరికే జెల్ ని అయినా వాడవచ్చు. పెరట్లో ఉండే కలబంద అయినా వాడవచ్చు.

Effective Home Remedies For Burning Sensation-

నిమ్మరసం

నిమ్మరసంలో ఆస్ట్రిజెంట్ లక్షణాలు ఉండుట వలన చర్మంపై కూలింగ్ ప్రభావాన్ని చూపి మంట,దురద తగ్గిస్తుంది. మంట,దురద ఉన్న ప్రదేశంలో కొంచెం నిమ్మరసం రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఓట్ మీల్

చర్మానికి చల్లదనాన్ని కలిగించి మంట,దురద తగ్గిస్తుంది. ఒక స్పూన్ ఓట్ మీల్ ను నీటిలో నానబెట్టి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతం మీద రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పసుపు

పసుపులో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన దురదకు కారణం అయిన బ్యాక్టీరియాను తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. పసుపులో నీరు కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.