ఇంటిలో దుర్వాసన పోవాలంటే అద్భుతమైన చిట్కాలు  

  • వానాకాలం మొదలు అయింది. వానాకాలంలో బట్టలు ఆరటం అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. ఆ బట్టలు సరిగా అరకపోవటం వలన ఒక రకమైన దుర్వాసన ఇంటిలో వస్తూ ఉంటుంది. ఆ దుర్వాసన తగ్గాలంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలి. ఇవి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఈ చిట్కాలలో ముఖ్యంగా నిమ్మరసం బాగా సహాయపడుతుంది. అసలు దుర్వాసన రావటానికి కారణం అయిన సూక్ష్మజీవులను నిమ్మలో ఉన్న సిట్రిక్ యాసిడ్ సమర్ధవంతంగా తరిమి కొడుతోంది. అందువల్ల దుర్వాసన పోవటానికి నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది.

  • బట్టలు ఉతికి జాడించటం అయ్యాక ఆరవేయటానికి ముందు ఒక బకెట్ నీటిలో రెండు నిమ్మకాయల రసంను పిండి ఆ నీటిలో ముంచి ఆరవేస్తే బట్టల నుంచి దుర్వాసన రాదు. ఇంటిని శుభ్రం చేసినప్పుడు ఆ నీటిలో కాస్త నిమ్మరసం పిండితే ఇంటిలో దుర్వాసన కూడా మాయం అయ్యిపోతుంది.

  • Effective Home Remedies For Bad Smell At Home-

    Effective Home Remedies For Bad Smell At Home

  • అలాగే వెనిగర్ కూడా నిమ్మరసం వలె పనిచేస్తుంది. వెనిగర్ కి ఫంగస్ ని నిర్ములించే శక్తి ఉంది. అందువల్ల ఇంటిని శుభ్రం చేసే నీటిలో వెనిగర్ వేస్తె ఇల్లంతా దుర్వాసన పోయి మంచి వాసన వస్తుంది.

  • నీటిలో బేకింగ్ సోడా వేసి బాగా కలిపి ఆ నీటిని దుర్వాసన వచ్చే ప్రదేశాలలో జల్లితే 5 నిమిషాల్లో దుర్వాసన మాయం అయ్యిపోతుంది.

  • ఉప్పును ఒక క్లాత్ లో వేసి మూటలా కట్టి ఇంటిలో దుర్వాసన వచ్చే ప్రదేశాలలో పెట్టాలి. అలాగే బట్టలు ఉన్న అరలలో పెట్టిన బట్టలకు ఉన్న తేమను ఉప్పు పీల్చుకొని దుర్వాసన రాకుండా చేస్తుంది.