తెల్ల జుట్టు.ప్రస్తుతం ఎందరినో బాధిస్తున్న సమస్య ఇది.
అందులోనూ యంగ్ ఏజ్‌లోనే తెల్ల జుట్టు వచ్చేస్తే.వారి బాధ వర్ణణాతీతం.
తెల్ల జుట్టును ఎలా నివారించుకోవాలో తెలీక, తరచూ కలర్స్‌తో కవర్ చేసుకోలేక తీవ్రంగా మదన పడుతుంటారు.అయితే ఇకపై ఆ టెన్షన్ మీకు అక్కర్లేదు.
ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ హెయిర్ ప్యాక్‌ను వారంలో కేవలం ఒక్కసారి ట్రై చేస్తే గనుక తెల్ల జుట్టు సమస్యే ఉండదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ ప్యాక్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి. వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల టీ పౌడర్ వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు టీ డికాక్షన్ను ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఇండిగో పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఉసిరికాయ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ గోరింటాకు పౌడర్, వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసి కలపాలి.
అలాగే చివరిగా ఇందులో మొదట తయారు చేసి పెట్టుకున్న టీ డికాక్షన్ కూడా వేసి ప్యాక్‌లా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఈ మిశ్రమాన్ని పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.గంట లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి.ఇలా వారంలో కేవలం ఒక్కసారి చేస్తే గనుక తెల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది.
మరియు జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.