చుండ్రు(డాండ్రఫ్).స్త్రీలనే కాదు పురుషులనూ తీవ్రంగా మదన పెట్టే సమస్య ఇది.తలలోని చర్మం పొడి బారి పోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్, కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూలను యూజ్ చేయడం, కాలుష్యం, వాతావరణంలో మార్పులు, డీహైడ్రేషన్ వంటి రకరకాల కారణాల వల్ల తలలో చుండ్రు ఏర్పడుతుంటుంది.దీనిని నిర్లక్ష్యం చేస్తే తలలో దురద, జుట్టు రాలడం, వెంట్రుకలు రఫ్‌గా మారడం వంటి తీవ్రమైన సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
అందుకే చుండ్రును వదిలించుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.అయితే ఒక్క దెబ్బతో చుండ్రు పోవడానికి ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ప్యాక్ అద్భుతంగా సహాయపడుతుంది.మరి లేట్ చేయకుండా ఆ హెయిర్ ప్యాక్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? మరియు ఏ విధంగా వాడాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని సైడ్స్‌ను మాత్రం తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్లో ఒక కప్పు చింతాకు, ఐదు మందారం ఆకులు, కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు, అర కప్పు పుల్లటి పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ పేస్ట్‌లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం యాడ్ చేసి మిక్స్ చేయాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.షవర్ క్యాప్‌ను ధరించాలి.ఒకటి లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి హెడ్ బాత్ చేయాలి.ఇలా చేస్తే గనుక తలలో ఉండే చుండ్రు మొత్తం పోవడమే కాదు.
కేశాలు బలంగా కూడా మారతాయి.కాబట్టి, చుండ్రును పోగొట్టుకునేందుకు ఖచ్చితంగా ఈ హెయిర్ ప్యాక్‌ను ప్రయత్నించండి.