వెంట్రుకలు రాలిపోతున్నాయా.... అయితే ఈ ఆయర్వేద చిట్కాలు ఫాలో అవ్వండి       2018-05-26   01:59:34  IST  Lakshmi P

నేటి జీవన శైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్య అధికం అవుతుంది. మగవారు బట్ట తల వస్తుందని కంగారు పడితే,ఆడవారు మాత్రం తమ అందం ఎక్కడ తగ్గిపోతుందో అని బాధపడుతూ ఉంటారు. అయితే మన పూర్వీకుల కాలం నుండి వాడుతున్న ఈ చిట్కాలను ఫాలో అయితే ఈ జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.

శీకాయ‌ను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిలో నీటిని కలిపి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానము చేయాలి. ఈ విధంగా ప్రతి వారం చేస్తూ ఉంటె జుట్టు రాలటం తగ్గుతుంది.

కుంకుడు కాయలను నలకొట్టి గింజలను తీసేసి వేడి నీటిలో నానబెట్టి ఆ నీటితో తలను రుద్దుకోవాలి. ఈ విధంగా ప్రతి వారం చేస్తూ ఉంటే ఆ సమస్య నుండి బయట పడవచ్చు. మార్కెట్ లో కుంకుడు కాయ పొడి కూడా దొరుకుతుంది. అది కూడా ఉపయోగించవచ్చు.

కలబంద గుజ్జును తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానము చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. అయితే తాజా కలబంద జ్యుస్ ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఉసిరికాయను పేస్ట్ చేసి దానిలో రోజ్ వాటర్ కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేయాలి. వీటిలో ఉండే ప్రోటీన్ ప‌దార్థం, విటమిన్ సి, ఇత‌ర పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.