ఎలక్షన్ ఎఫెక్ట్ ! చిన్న నోట్లకు పెద్ద డిమాండ్     2018-10-21   21:40:28  IST  Sai Mallula

తెలంగాణాలో ఎన్నికల సందడి మొదలవ్వడంతో పాటు పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చేస్తుండడంతో… జనాలకు పంచేందుకు భారీగా డబ్బులు పోగుచేసుకున్నారు నాయకులు. అయితే రూ.2,000 నోట్లను చిన్న నోట్లలోకి మార్చుకునేందుకు బ్యాంకులు, పెట్రోల్‌ బంకులను ఆశ్రయిస్తున్నారు. దీంతో రూ.500, రూ.200 నోట్లకు గిరాకీ ఏర్పడింది. నోట్లు మార్పిడి చేసినందుకు 2 నుంచి 5 శాతం దాకా కమీషన్‌ ఆఫర్‌ చేస్తున్నారు.

Effect Of Election Bigger Demand For Small Notes-

Effect Of Election Bigger Demand For Small Notes

బ్యాంకు లావాదేవీలపై ఎన్నికల సంఘం నిఘా వేయటంతో నోట్ల మార్పిడికి తెలంగాణ నేతలు పక్క రాష్ట్రాలపై దృష్టి సారిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్, కర్నాటకలోని ప్రైవేట్‌ బ్యాంకులను సైతం ఎంచుకుంటున్నారు. తనిఖీల్లో తెలం గాణలో పట్టుబడుతున్న నగదులో రూ.500 నోట్లే అత్యధికంగా ఉండటం నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్నారనేది అర్ధం అవుతోంది. అంతే కాదా ఎన్నికలంటే నాయకులు ఇలా పడరాని పాట్లు పడాల్సిందే.