బీజేపీలో జాయిన్ అయిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి ఈట‌ల రాజేంద‌ర్..!!

ఇటీవల హైదరాబాద్ నుండి ఢిల్లీకి ప్రత్యేక విమానాల్లో ఈట‌ల రాజేంద‌ర్ బయలుదేరి అక్కడ కాషాయ కండువ కప్పుకున్న సంగతి తెలిసిందే.బీజేపీలో ఈట‌ల రాజేంద‌ర్ జాయిన్ కావటంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

 Eetela Rajendar Bjp Rally In Huzurabad-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఢిల్లీ లో జాయిన్ అయిన తర్వాత మరుసటి రోజు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఈట‌ల రాజేంద‌ర్ తొలిసారి సొంత నియోజకవర్గం హుజరాబాద్ కి బిజెపి నాయకులతో కలిసి బయలుదేరారు.ఈ పర్యటనలో మాజీ చైర్మన్ స్వామి గౌడ్ కూడా ఈట‌ల రాజేంద‌ర్ వెంట ఉన్నారు.

దాదాపు నాలుగు రోజులపాటు ఈట‌ల రాజేంద‌ర్ అదేవిధంగా బిజెపి నాయకులు నియోజకవర్గంలో పర్యటించి స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పార్టీ బలోపేతానికి కావాల్సిన నిర్ణయాల విషయంలో చర్చించనున్నారు.ముఖ్యంగా ఈట‌ల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో మరో ఆరు నెలల్లో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్న క్రమంలో వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఈట‌ల స్థానిక బిజెపి నాయకులతో వ్యూహాలు వేస్తున్నట్లు సమాచారం.

 Eetela Rajendar Bjp Rally In Huzurabad-బీజేపీలో జాయిన్ అయిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి ఈట‌ల రాజేంద‌ర్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరోపక్క అధికార పార్టీ టిఆర్ఎస్ కూడా హుజురాబాద్ నియోజకవర్గం పై ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది.  

.

#Eetela Rajendar #Etala Rajendar #Huzurabad #Telengana Bjp #Central Govt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు