అక్కడ కరోనా వ్యాపిస్తే మరింత ప్రమాదకరం..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కోరలు చాస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా తెన ప్రభావం చూపిస్తుంది.

 Eetela Rajendar About Corona Effect In Telangana State , Corona Effect,  Eetela-TeluguStop.com

అయితే సిటీల్లో ఎక్కువగా కోవిడ్ కేసులు వస్తుండగా ఇప్పుడు వస్తున్న కేసులలో గ్రామాల నుండి వస్తున్నాయని తెలుస్తుంది.దీనిపై తెలంగాణా మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.

పల్లెలకు కోవిడ్ వ్యాపిస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అది గ్రామాలకు వెళ్లకుండా అందరు జాగ్రత్త వహించాలని అన్నారు.ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని తెలిపారు ఈటల రాజేందర్.

కరీంనగర్ జిల్లా తుమ్మనపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజేందర్ కరోనా తీవ్రతపై ఆయన మాట్లాడారు.రాత్రి కర్ఫ్యూ అమ్మల్లోకి వస్తే కరోనా కేసులు కొద్దిగా తగ్గే అవకాశం ఉందని అన్నారు.

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ వేసే కేంద్రాల సంఖ్య పెంచామని.భవిష్యత్తులో మరిన్ని పెంచుతామని అన్నారు.45 ఏళ్లు నిండిన వారందరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్ లో రెం డెసివిర్ ఇంజెక్షన్ల కొరత లేదని ఆయన తెలిపారు.

రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరామని.ఆక్సిన కొరత రాకుండా సిఎం కె.

సీ.ఆర్ పర్యవేక్షిస్తున్నారని అన్నారు. తెలంగాణాలో సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రభుత్వం దానిపై పోరాడేందుకు సిద్ధంగా ఉందని.ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించి నిబంధనలు పాటించాలని అన్నారు రాజేందర్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube