మూడుసార్లు ఈట‌ల రాజీనామా.. కొత్త రికార్డు క్రియేట్ చేసిన నేత‌!

ఈట‌ల రాజేంద‌ర్ అంటే తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క‌నేత‌.ఆయ‌న కోసం బీజేపీ పెద్ద‌పీట వేసి మ‌రీ తీసుకెళ్తోందంటే ఆయ‌నకు ఉన్న ప్రాముఖ్య‌త ఉందో అర్థం చేసుకోవచ్చు.

 Eetala Resigns Three Times Leader Who Created A New Record!, Etala, Trs, Politic-TeluguStop.com

అయితే అంద‌రూ అనుకున్న‌ట్టే త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి ఈ రోజు ఆయ‌న రాజీనామా చేశారు.దీంతో ఒక్క‌సారిగా రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం చెల‌రేగింది.

ఇక త్వ‌ర‌లోనే ఆయ‌న బీజేపీ కండువా క‌ప్పుకోనున్నారు.

అయితే ఈట‌ల రాజీనామా అనే విష‌యానికొస్తే.

ఆయ‌న రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు అనేక‌మ‌నే చెప్పాలి.ఇప్ప‌టికే రెండుసార్లు ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు.

మొద‌ట్లో కేసీఆర్ కు న‌మ్మిన బంటుగా పేరు తెచ్చుకున్న ఈట‌ల‌.ఆ త‌ర్వాత సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన క‌మ‌లాపూర్‌లో పార్టీని బ‌లోపేతం చేశారు.2004లో తొలిసారిగా టీఆర్ ఎస్ పార్టీ నుంచి క‌మ‌లాపూర్ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థిగా పోటీచేసి అప్ప‌టి దిగ్గ‌జ నేత‌, మంత్రి అయిన ముద్దసాని దామోదర్‌రెడ్డిని ఓడించి గెలిచారు.

Telugu @ktrtrs-Telugu Political News

ఇది అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌న‌మే.అయితే ఉద్య‌మంలో కీల‌కంగా ఉన్న‌ప్పుడు 2008, 2010లో కూడా త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి ఈట‌ల రాజీనామా చేశారు.ఈ రెండు ఉప ఎన్నిక‌ల్లో గెలిచి త‌న సత్తా ఏంటో చూపించారు.

ఇలా ప‌ద‌విలో ఉండ‌గానే రెండు సార్లు రాజీనామా చేసిన వ్య‌క్తిగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో రికార్డు క్రియేట్ చేశాడు.ఇప్పుడు కూడా తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత రాజీనామా చేసిన తొలి ఎమ్మెల్యేగా ఈట‌ల మ‌రో రికార్డు క్రియేట్ చేశారు.

అయితే ఇక్క‌డ మూడుసార్లు ఆయ‌న రాజీనామా చేయ‌డానికి కేసీఆర్ కార‌ణం అవ్వ‌డం విశేషం.గ‌తంలో రెండుసార్లు ఉద్య‌మం కోసం రాజీనామా చేస్తే.ఈ సారి కేసీఆర్ మీద కోపంతో రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం.మ‌రి ఈ సారి కూడా గెలిచి త‌న స‌త్తా చూపిస్తారా లేదా అని చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube