తెలుగు అమ్మాయిలకి టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రావనేది చాలా మంది అభిప్రాయం.ఈ తరం తెలుగు హీరోయిన్స్ లో చాలా మందికి ఈ అభిప్రాయం ఉంది.
అందం, అభినయం ఉన్నా కూడా తెలుగమ్మాయిలని హీరోయిన్స్ గా మన దర్శకులు పరిగణించరు.పక్క రాష్ట్రాల అమ్మాయిల మీద ఉన్నంత శ్రద్ధ తెలుగు అమ్మాయిల మీద ఉండదు.
కొంత మందికి హీరోయిన్ గా అవకాశాలు వచ్చిన చిన్న సినిమాలకే పరిమితం అవుతారు.అందాల ప్రదర్శనలో బాలీవుడ్ భామలతో సమానం చేసిన తేజస్విని, శోభిత దూళిపాల్ల లాంటి డస్కీ బ్యూటీస్ ని కూడా మన దర్శకులు పట్టించుకోరు.
శోభిత బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది.ఇక తేజస్విని క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కి పరిమితం అయిపొయింది.
ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో కొద్దో గొప్పో రాణిస్తున్న తెలుగు అందం ఇషా రెబ్బా.
ఈమెకి గొప్పగా అవకాశాలు రాకపోయినా తీసి పారేసే పరిస్థితి అయితే లేదు.గ్లామర్ గా కనిపించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె తన ఫోటో షూట్ లతో చెబుతుంది.
దీంతో ఉన్నంతలో మంచి బ్యానర్ లలో సినిమాలు చేసే అవకాశం ఇషా సొంతం చేసుకుంటుంది.అరవింద సమేత సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇషాకి అవకాశం ఇచ్చిన అది ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రగా మిగిలిపోయింది.
అయితే మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ భామకి అవకాశం ఇచ్చాడని టాక్ నడుస్తుంది.ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లు అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.
ఈ సినిమా కోసం ఇషా రెబ్బాకి త్రివిక్రమ్ ప్రామిస్ చేసినట్లు సమాచారం.ఈ సారి మాత్రం పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ గా కాస్తా గుర్తింపు ఉన్న పాత్రనే ఇవ్వనున్నాడని చెప్పుకుంటున్నారు.
మరి ఇది ఎంత వరకు వాస్తవం అనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యేంత వరకు వేచి చూడాలి.