బాక్సర్ గా కనిపించబోతున్న తెలుగు అందం ఇషా రెబ్బ

తెలుగు అమ్మాయిలకి తెలుగు సినిమాలలో హీరోయిన్ గా అనుకున్న స్థాయిలో అవకాశాలు రావనేది చాలా మంది మాట.అందుకు తగ్గట్లుగానే ఈ మధ్య కాలంగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అందాల భామలు పేర్లు వెతికితే ఒకరు ఇద్దరు కనిపిస్తారు.

 Eesha Rebba Play Boxer Role Her Next Movie, Tollywood, Telugu Heroines, Love Sto-TeluguStop.com

తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కొంత మంది భామలు కోలీవుడ్ కి వలస పోయారు.ఐశ్వర్య రాజేష్ తెలుగమ్మాయి అయినా ముందుగా కోలీవుడ్ లో సక్సెస్ అయ్యి ఇక్కడ అడుగు పెట్టింది.

అయినా కూడా తెలుగులో ఈ అమ్మడుకి పెద్దగా అవకాశాలు లేవు.శోభిత దూళిపాళ్ల హీరోయిన్ గా తెలుగులో ఒకే సినిమా చేసింది.

హిందీలో ఈ అమ్మడుకి బాగానే అవకాశాలు ఉన్నాయి.అందాల ప్రదర్శనకి సిద్ధంగా ఉన్న శోభితని ఎవరూ పట్టించుకోవడం లేదు.

తెలుగులో ఈ ఓ మోస్తారుగా కనిపిస్తున్న అందాల భామ ఇషా రెబ్బ.ఇప్పటి వరకు చిన్న సినిమాలతో నెట్టుకొచ్చిన ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది.

అరవింద సమేత సినిమాలో ఓ పాత్రలో మెరిసిన అది అంతగా ప్రాధాన్యత లేకుండా పోయింది.అయితే ఓ పెద్ద హీరో సినిమాలో హీరోయిన్ గా అమ్మడుకి అవకాశం వచ్చింది.

ప్రస్తుతం లవ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో ఇషా రెబ్బ నటిస్తుంది.త్వరలో ఈ వెబ్ సిరీస్ ప్రసారం అవుతుంది.ఇదిలా ఉంటే కన్నడంలో శివరాజ్ కుమార్ కి జోడీగా ఓ సినిమాలో కనిపించబోతుంది.ఇదిలా ఉంటే త్వరలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో ఈ అమ్మడు నటించనున్నట్లు తెలుస్తుంది.

ఒక ప్రెస్టీజియస్‌ బ్యానర్‌‌‌ నిర్మించే ఈ చిత్రంలో ఇషా బాక్సర్‌‌ గా కనిపించనుంది.ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది.

నా నెక్ట్స్ మూవీలో నేను బాక్సర్‌‌గా కనిపించబోతున్నాను.దానికోసం ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాను.

తెరపై నిజమైన బాక్సర్‌‌లా కనిపించేందుకు జిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకుంటున్నాను.కథ నన్ను బాగా ఇన్‌స్పైర్ చేసింది.

ఎప్పుడెప్పుడు బాక్సింగ్ గ్లోవ్స్ వేసుకుని బరిలోకి దిగుదామా అనిపిస్తోంది అంటోంది.త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube