'ధమాకా' కోసం ఇషా రెబ్బా ను రంగంలోకి దించుతున్న మేకర్స్!

మాస్ మహారాజా రవితేజ ప్రెసెంట్ నటిస్తున్న సినిమాల్లో ధమాకా కూడా ఒకటి.విజయ దశమి సందర్భంగా ప్రకటించిన ఈ సినిమాను త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్నారు.

 Eesha Rebba In Ravi Teja Dhamaka Movie Item Song,  Eesha Rebba, Trinadha Rao Nak-TeluguStop.com

అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల రవితేజకు జోడీగా నటిస్తుంది.

ఈ సినిమాను టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఒక అదిరి పోయే మసాలా సాంగ్ కూడా ఉందని చిత్ర యూనిట్ చెబుతుంది.

మాస్ సాంగ్ కూడా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని చెబుతున్నారు.ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఒక భామను చిత్ర యూనిట్ ఎప్పటి నుండో వెతుకుతుంది.

అయితే ఈ సాంగ్ లో అనసూయ చేయబోతోందని ముందు నుండి ప్రచారం జరుగుతూ వస్తుంది.

Telugu Eesha Rebba, Eesharebba, Item, Ravi Teja, Tollywood, Trinadharao-Movie

కానీ అనసూయ రవితేజ ఖిలాడి సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది.ఇక ఇప్పుడు ఈమెనే మళ్ళీ ఐటం సాంగ్ లో తీసుకోవడం అంత కిక్ ఇవ్వదని చిత్ర యూనిట్ బావించిందట.దీంతో మరొక భామ కోసం సర్చింగ్ జరుగుతుందట.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ ధమాకా లో మాస్ ఐటెం సాంగ్ కోసం తెలుగు అమ్మాయిని తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.

Telugu Eesha Rebba, Eesharebba, Item, Ravi Teja, Tollywood, Trinadharao-Movie

ధమాకా ఐటెం సాంగ్ కోసం ఇషా రెబ్బా ను రంగం లోకి దించేందుకు టీమ్ ప్రయత్నాలు చేస్తుందట.ఈమె తెలుగు అమ్మాయి అయినా కూడా అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డు చెప్పదు.దీంతోఈమెతో ఐటెం సాంగ్ చేయిస్తే సినిమాపై కూడా మంచి హైప్ వస్తుందని భావిస్తున్నారట.

ఇప్పటికే చిత్ర యూనిట్ ఈషా రెబ్బా తో చర్చలు జరిపారని ఆమె కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమా షూటింగ్ ఫాస్ట్ గా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube