టాలీవుడ్ లో లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి అంటున్న ఈషా రెబ్బ

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకి హీరోయిన్స్ గా అవకాశాలు పెద్దగా దొరకవని చాలా మంది అభిప్రాయం.రెండు దశాబ్దాల క్రితం వరకు తెలుగు తెరపై తెలుగమ్మాయిలదే హవా ఉండేది.

 Eesha Rebba Comments Industry Struggles In Tollywood, Telugu Heroines, Tollywood-TeluguStop.com

అయితే సినిమాలో గ్లామర్ స్థాయి పెరిగాక, హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ కురచ అయ్యాక తెలుగు హీరోయిన్స్ మన దర్శక నిర్మాతలకి బరువైపోయారు.గ్లామర్ షోకి తెలుగమ్మాయిలు ఎక్కువగా ఆసక్తి చూపించకపోవడంతో దర్శకులు నార్త్ ఇండియా భామలవైపు దృష్టి పెట్టారు.

అప్పటి నుంచి హీరోయిన్స్ దిగుమతి స్టార్ట్ అయ్యింది.ఈ కారణంగా టాలెంట్ ఉన్నా కూడా తెలుగమ్మాయిలు పెద్ద స్టార్స్ సినిమాలలో అవకాశాలు తెచ్చుకోలేకపోతున్నారు.

ఏదో చిన్న సినిమాలలో అవకాశాలు వస్తున్న అనుకున్న స్థాయిలో గుర్తింపు, సక్సెస్ రావడం లేదు.దీంతో హీరోయిన్స్ గా ఎదగాలని అనుకునే తెలుగమ్మాయిలు కోలీవుడ్ కి వలస పోతున్నారు.

కొందరు వేరే బాషలో చేసే ఆసక్తి లేక తెలుగు అవకాశం వచ్చినప్పుడే చేద్దాం అనే ఉద్దేశ్యంతో ఉండిపోతున్నారు.ఇదిలా ఉంటే టాలీవుడ్ లో లోకల్ టాలెంట్ కి ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై హీరోయిన్ ఇషారెబ్బా తాజాగా ఓ యుట్యూబ్ చానల్ ఇంటర్వ్యూ లో తన అభిప్రాయం చెప్పుకొచ్చింది.

తెలుగమ్మాయిలకి తెలుగు సినిమాలలో ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదు అనేది నాకు ఇప్పటికి అర్ధం కావడం లేదు.గ్లామర్, టాలెంట్ ఉన్న కూడా అవకాశాలు రావడం కష్టం అయిపోతుంది.

నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐదేళ్ళు అవుతున్న ఇప్పటికి స్ట్రగుల్స్ పేస్ చేస్తున్న.నాకు పెద్ద స్టార్స్ తో చేయాలని ఉంది.

కాని అవకాశాలు ఇచ్చే వారే లేరు.తెలుగు అమ్మాయిలు అనే కాకుండా తెలుగు నటులు చాలా మందికి సరైన ప్రాధాన్యత సినిమాలలో లభించడం లేదు.

కచ్చితంగా లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసి 50-50 ఛాన్స్ లు ఇచ్చిన ఇక్క చాలా మంది మంచి అవకాశాలు లభిస్తాయని ఇషారెబ్బ చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube