వైరల్‌ : 2013లోనే ఈనాడులో కరోనా వార్తలు.. అసలు విషయం చెప్పిన శాస్త్రవేత్తలు

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌ గురించి మన తెలుగు న్యూస్‌ పేపర్‌ 2013లోనే ఒక వార్త వచ్చింది.సార్స్‌ తరహా వైరస్‌ నోవెల్‌ కరోనా వైరస్‌తో జనాలు మృతి చెందుతున్నారు, ఆరుగురు చేరారు అంటూ ఈనాడులో వార్తలు వచ్చాయి.

 Do You Know Corona Virus First Case Enroll In The Year Of 2013, Eenadu Pappers,-TeluguStop.com

లండన్‌లోని క్వీన్‌ ఎలిజబెత్‌ హాస్పిటల్‌లో ఆరుగురు కరోనా వైరస్‌ వల్ల మృతి చెందినట్లుగా 2013 ఫిబ్రవరి 20వ తారీకున వచ్చిన న్యూస్‌ పేపర్‌లో వార్త వచ్చింది.ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.2013లోనే కరోనా వైరస్‌ వచ్చింది.ఆ సమయంలో పెద్దగా విస్తరించలేదు.

అప్పుడే దీనికి మందు కనిపెట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటూ జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Telugu Covid, Corona Enroll, Londonqueen, Telugu Pappers, Novel Corona-General-T

అసలు విషయం ఏంటీ అంటే.2013లో కరోనా వైరస్‌ వల్ల ఆరుగురు మృతి చెందిన మాట వాస్తవమే, ఆ న్యూస్‌ కూడా నిజమే.కాని నోవెల్‌ కరోనా జాతికి చెందినవి అనేక రకాల వైరస్‌లు ఉంటాయి.

ఆ వైరస్‌లలో ఒకటి కోవిడ్‌ 19.అప్పుడు వచ్చిన వైరస్‌ కరోనా జాతికి చెందినది.కాని అది అంత ప్రమాదకరం కాదట.అత్యంత ప్రమాదకారి ఇప్పుడు వచ్చిన కోవిడ్‌ 19.కరోనా వైరస్‌లు వందల రకాలు ఉంటాయని గతంలో కూడా పలు సార్లు కరోనా జాతికి చెందిన వైరస్‌లు వ్యాప్తి చెందాయి.వాటికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్‌ ఏవో ఒకటి పని చేశాయి.

Telugu Covid, Corona Enroll, Londonqueen, Telugu Pappers, Novel Corona-General-T

ప్రస్తుతం విజృంభిస్తున్న కోవిడ్‌ 19కు మాత్రం ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క వ్యాక్సిన్‌ లేదా టీకాలు పని చేయడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మీడియాలో వస్తున్న పలు వార్తలను వింటూ చూస్తూ ఆందోళన చెందనక్కర్లేదని, ఎంతటి ప్రమాదకరమైన వైరస్‌కు అయినా మందు కనిపెట్టవచ్చు.కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్పీడ్‌గా మందు కనిపెట్టాల్సి ఉందని, అందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఒక్కతాటిపైకి వచ్చి పని చేస్తున్నట్లుగా ఒక శాస్త్రవేత్త అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube