వారంలో ఏ రోజున ఏ పని చేస్తే కలిసివస్తుందో తెలుసా?

ప్రతి ఒక్కరు ఏదైనా పని చేసినప్పుడు మంచి రోజు చూసుకొని మరీ చేస్తూ ఉంటారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో రోజుకి ఒక్కో దేవత అధిపతిగా ఉంటారు.

 Ee Roju Ee Pani Cheste Manchidi-TeluguStop.com

వారి అనుగ్రహంతోనే పనులు జరుగుతూ ఉంటాయి.ఇప్పుడు ఏ రోజు ఏ పని చేస్తే కలిసి వస్తుందో తెలుసుకుందాము.

ఆదివారం

ఆదివారంనకు అధిపతి సూర్యుడు.అందువల్ల ఆ రోజు గులాబీ లేదా కుంకుమ రంగు వస్త్రాలు ధరించి రాజకీయ వ్యవహారాలు, పదోన్నతలకు ప్రయత్నం లాంటివి మొదలుపెడితే ఫలితం ఉంటుంది.

సోమవారం

సోమవారంనకు అధిపతి.చంద్రుడు.

ఆ రోజున తెల్లటి దుస్తులను వేసుకొని షాపింగ్, ఇల్లు శుభ్రచేయడం, పార్టీలు లాంటివి చేయటం మంచిది.

మంగళవారం

మంగళవారంనకు అధిపతి కుజుడు.ఈ రోజు ఎర్రటి వస్త్రాలను ధరించాలి.ఈ రోజు యంత్రాలు కొనుగోళ్లు, మరమ్మత్తులకు అనుకూలమైన రోజు.

బుధవారం

బుధవారంనకు అధిపతి బుధుడు.ఈ రోజున విద్యా సంబంధమైన విషయాలు, వ్యాపారాల్లో పెట్టుబడులకు అనూలమైన రోజు.

బుధుడు తెలివితేటలను ఇస్తాడు.అందువల్ల తెలివికి సంబందించిన పనులను చేయాలి.

గురువారం

గురువారంనకు అధిపతి దేవ గురువు బృహస్పతి.అందువల్ల ఆ రోజు ఏ పని చేసిన బాగా కలిసి వస్తుంది.

శుక్రవారం

శుక్రవారంనకు అధిపతి శుక్రుడు.శుక్రుడు ఆనందాన్ని ఇస్తాడు.కాబట్టి అందరితో ఆనందంగా గడపటానికి ఈ రోజు అనువైన రోజు.

శనివారం

శనివారంనకు అధిపతి శని.అందువల్ల ఈ రోజు దీర్ఘకాలికంగా పూర్తీ అయ్యే పనులను మొదలు పెట్టవచ్చు.అంతేకాక శని మన పాపపుణ్యాలను గమనిస్తాడు కాబట్టి.

దానాలు చేయడం, ఆలయాలను దర్శించడం లాంటి పనులు ఈ రోజున చేస్తే మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube