ఈ నగరానికి ఏమైందిమూవీ స్టోరీ, రివ్యూ..రేటింగ్       2018-06-28   23:17:13  IST  Raghu V

Cast & Crew:

న‌టీన‌టులు: విష్వ‌క్సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభిన‌వ్ గొమ‌టం, వెంక‌టేశ్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్‌, సిమ్ర‌న్ చౌద‌రి, గీతా భాస్క‌ర్ దాస్యం త‌దిత‌రులు
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: ల‌తా త‌రుణ్ దాస్యం
కెమెరా: నికేత్ బొమ్మి
సంగీతం: వివేక్ సాగ‌ర్‌
ఎడిటింగ్‌: ర‌వితేజ గిరిజాల‌
నిర్మాత‌: డి.సురేశ్ బాబు
ద‌ర్శ‌క‌త్వం: త‌రుణ్ భాస్క‌ర్ దాస్యం

-

Story:

వివేక్ (విశ్వక్ సేన్ నాయుడు), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను)లు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కౌశిక్‌ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తూ ఎప్పటికైనా యాక్టర్‌ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాసెట్స్‌ ఎడిటింగ్‌ చేస్తూ ఉంటాడు. కార్తీక్‌ తాను పనిచేస్తున్న క్లబ్‌ ఓనర్‌ కూతురిని పెళ్ళి చేసుకొని అమెరికాలో సెటిల్‌ అవ్వాలని కలలు కంటుంటాడు. షార్ట్ ఫిల్మ్ తీయాల‌న్న‌ది గోల్‌. ఆ ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గానే వివేక్ ప్రేమ‌లో ప‌డతాడు. అత‌నికున్న భ‌యాన్ని చూసి అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్ బ్రేక‌ప్ చెబుతుంది. దాంతో తాగుడుకు బానిసై క‌ర్త‌వ్యాన్ని నిర్ల‌క్ష్యం చేస్తుంటాడు వివేక్‌. కానీ అనుకున్నట్టుగా కార్తీక్‌కి ఓనర్‌ కూతురితో పెళ్లి కుదరటంతో పార్టీ చేసుకోవడానికి అందరూ ఒక్కటవుతారు. ఆ పార్టీలోనే రింగు పోగొట్టుకుంటాడు. తాగిన మ‌త్తులో ఉన్న ఫ్రెండ్స్ అక్క‌డి నుంచి గోవాకు చేరుకుంటాడు. ఖ‌రీదైన రింగు కొన‌డం కోసం వారు చేసిన ప్ర‌య‌త్నాలు ఏంటి? గోవా చేరిన నలుగురు స్నేహితులు ఏం చేశారు..? ఈ ప్రయాణం వారికి జీవితం అంటే ఏంటో ఎలా చూపించింది.? ఈ ట్రిప్ తరువాత వారు ఎలా మారిపోయారు? అన్నదే మిగతా కథ.

Review:

నలుగురు కుర్రాళ్ళు విశ్వక్ సేన్ నాయుడు , సుశాంత్ రెడ్డి , వెంకటేష్ కాకుమాను , అభినవ్ గోమఠం కొత్త కుర్రాళ్ళు అయినప్పటికీ వాళ్ళ వాళ్ళ పాత్రల్లో బాగా రాణించారు . విశ్వక్ సేన్ నాయుడు చాలా బాగా నటించాడు , ఇక అభినవ్ గోమఠం కామెడీ కుర్రాళ్లకు బాగా రిలీఫ్ నిచ్చింది . మిగిలిన పాత్రధారులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు . ముందుగా దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే ..పెళ్లి చూపులు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా మళ్ళీ కొత్తవాళ్ల తో ప్రయోగం చేయడం అభినందనీయం . దాదాపుగా తన కథనే రాసుకున్నాడు తరుణ్ , దర్శకుడు కాకముందు తరుణ్ పడిన బాధని ప్రధాన పాత్ర చేసి చూపించిన విధానం బాగుంది . ఫ్రెండ్స్ చుట్టూ అల్లిన కథ తో కుర్రాళ్ళని టార్గెట్ చేసాడు తరుణ్ భాస్కర్ . ఫస్టాఫ్ లో కొంత లాగ్ ఉన్నప్పటికీ యువత ని ఆకట్టుకునేలా ఓ మెసేజ్ ని అందించి మెప్పించాడు . వివేక్ సాగర్ సంగీతం ఈ చిత్రానికి మరో హైలెట్ అలాగే నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం కూడా హైలెట్ గా నిలిచింది .

Plus points:

న‌టీన‌టుల న‌ట‌న‌
కామెడీ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌
టెక్నిక‌ల్ టీమ్ వ‌ర్క్

Minus Points: అక్క‌డ‌క్క‌డ సాగ‌దీత‌
ప్రేమ స‌న్నివేశాలు మిస్ కావ‌డం
స‌హజ‌త్వానికి దూరంగా ఉన్న‌ట్టు అనిపించ‌డం

Final Verdict:

యూత్ ని ఆకట్టుకునే సందేశాత్మక చిత్రం అనడంలో సందేహం లేదు

Rating: 3.25 / 5

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.