వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న కారును స్థానికులు ఎలా లాక్కొచ్చారో చూడండి..

Ee How The Locals Locked The Car That Was Trapped In The Flood

వ‌ర‌ద‌లు అనే మాట వింటేనే చాలా రాష్ట్రాలు వ‌ణికిపోతున్నాయి.ఎందుకంటే మ‌న దేశంలో వ‌ర‌ద‌లు సృష్టిస్తున్న బీభ‌త్సం అలా ఉంది మ‌రి.

 Ee How The Locals Locked The Car That Was Trapped In The Flood-TeluguStop.com

ఇప్ప‌టికే గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, తెలంగాణ, ఉత్త‌రాఖండ్ లాంటి రాష్ట్రాల్లో వ‌ర‌ద‌లు సృష్టించిన స‌మ‌స్య‌లు అన్నీ ఇన్నీ కావు క‌దా.అయితే ఇప్పుడు కేర‌ళ వంతు వ‌చ్చేసింది.

ఈ రాష్ట్రంలో ఇప్ప‌టికే వ‌ర‌ద‌లు భారీగా వ‌స్తున్నాయి.దీంతో చాలా ప్రాంతాలు నీట మునుగుతున్నాయి.

 Ee How The Locals Locked The Car That Was Trapped In The Flood-వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న కారును స్థానికులు ఎలా లాక్కొచ్చారో చూడండి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో రోడ్లు మొత్తం చిన్న పాటి వాగుల‌ను త‌ల‌పిస్తున్నాయి.ఇప్ప‌టికే ఎన్నో ఏరియాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.

మ‌రి రోడ్ల మీద నీరు ఉంటే కార్లు, బైకులు వెళ్లేందుకు ఎంత‌లా ఇబ్బంది అవుతుందో అంద‌రికీ తెలిసిందే క‌దా.కాగా ఇప్పుడు ఓ చోట ఇదే ప్రాబ్ల‌మ్ వ‌చ్చి ప‌డింది.

కొట్టాయం గ్రామీణ ఏరియాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వానలకు అక్క‌డి రోడ్లన్నీ నీటిలో మునిగాయి.ఈ క్ర‌మంలోనే ఒక‌రు కారు వ‌ర‌ద‌లో కొట్టుకుని పోతుండ‌గా అక్క‌డున్న వారు గుర్తించారు.

వెంట‌నే దాన్ని నడుంలోతు నీటిలో ఉంగా కూడా స్థానికులు ధైర్యం చేసి మ‌రీ అందులోకి దిగారు.ఇలా దిగిన వారు వెంట‌నే ఓ ఐడియా వేశారు.

ఎలాగైనా కారును బ‌య‌ట‌కు తీసుకు రావాల‌ని డిసైడ్ అయ్యారు.

అంతే వారంతా కూడా ఆ కారును తాడు సాయంతో బ‌య‌ట‌కు లాగేందుకు ప్ర‌య‌త్నించారు.వ‌ర‌ద నీటి ప్ర‌వాహం ఎక్కువ‌గా ఉండ‌టంతో చాలా ఇబ్బందిగా మారింది.అస‌లే న‌డుం లోతు నీళ్లు కూడా ఉన్నాయి.

అయినా కూడా వారు ప‌ట్టు విడువ‌కుండా ఆ కారును పక్కకు లాగారు.ఇదంతా కూడా అక్క‌డున్న వీడియో తీసి నెట్టింట షేర్ చేయ‌గా విప‌రీతంగా వైల‌ర్ అవుతోంది.

వారి అంకిత భావానికి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.దీంతో పాటు పూంజార్‌లోకూడా కేఎస్‌ఆర్టీసీ బస్సు ఇలాగే వ‌ర‌ద‌ల్లో చిక్కుకుంది.

అందులోని ప్ర‌యాణికుల‌ను స్థానికులు కాపాడారు.

.

#Trapped Flood #Kerala Floods #Kerala #Havey

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube